
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న వేళ రష్యా వైమానిక దళం పొరపాటున సరిహద్దుల్లోని సొంత నగరంపైనే భారీ బాంబు వేసింది. ఉక్రెయిన్ సరిహద్దుకు 25 మైళ్ల దూరంలోని బెల్గొరొడ్ నగరంలోని అపార్టుమెంట్‌కు సమీపంలో తమ బాంబర్లు అనుకోకుండా ఒక బాంబు వేసినట్లు రష్యా మిలటరీ ధ్రువీకరించింది.
ఈ ఘటనతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సుమారు 500 కిలోల బరువైన శక్తివంతమైన బాంబు పేలి 20 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడింది. పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడగా ఒక వ్యక్తి హైబీపీతో ఆస్పత్రి పాలయ్యాడని అధికారులు తెలిపారు.