మీ దేశం వెళ్లిపొండి.. భారతీయ జంటపై జాత్యాహంకారం | Indian-Origin Couple Faces Racist Abuse In The US, Viral Video Sparks Controversy, Check More Details Inside | Sakshi
Sakshi News home page

మీ దేశం వెళ్లిపొండి.. భారతీయ జంటపై జాత్యాహంకారం

May 27 2026 12:15 AM | Updated on May 27 2026 11:01 AM

Racist comments against Indian couple in America

అమెరికాలో భారతీయులపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ విషయమై ఆ దేశ మంత్రి మార్కో రూబియో వివరణ ఇచ్చినప్పటికీ పరిస్థితులు ఏ మాత్రం మారడం లేదు.  తాజాగా అటువంటి ఘటన మరోకటి జరిగింది. భారతీయ సంతతికి చెందిన ఓ జంటను మీరు తిరిగి భారత్‌కు వెళ్లాలంటూ అమెరికాలో ఉండకూడదంటూ ఓ అపరిచితుడు హెచ్చరించాడు. తాజాగా  ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.  

ఇటీవల భారత పర్యటనకు వచ్చిన మార్కోరూబియోను అమెరికాలో భారతీయులపై  జరుగుతున్న జాత్యహంకార ఘటనలపై ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ .. "ప్రతి దేశంలో  ఆన్‌లైన్‌లో లేదా బహిరంగంగా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడే కొంతమంది మూర్ఖులు ఉంటారు, కానీ అది ఒక దేశం యొక్క నిజమైన గుర్తింపును నిర్వచించదు. అమెరికా ప్రపంచంలోనే అత్యంత ఆతిథ్యమిచ్చే దేశాలలో ఒకటిప్రపంచ నలుమూలల నుండి అమెరికాకు వచ్చి, అమెరికన్ సమాజంలో కలిసిపోయి,  దేశ ప్రగతికి దోహదపడిన ప్రజల వల్లే దేశం బలోపేతమైంది" అని రూబియో పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఒక ప్రాంతంలో ఒక భారతీయ జంట నిల్చొని ఉంది.  అక్కడే ఉన్న ఓ అమెరికా దేశస్థుడు..  ఆ జంటను.. మీరు భారతీయులా . అమెరికా కంటే భారతదేశం మంచిదా అని ప్రశ్నించారు. ఆ దంపతులు సంయమనంతో సంభాషణను కొనసాగించారు. వారి కుటుంబం భారతదేశంలో ఉందని భర్త వివరిస్తుండగా, భారతదేశం అంత బాగుంటే మీరు అమెరికాలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించాడు.

దానికి అక్కడే ఉన్న వ్యక్తి  ప్రపంచాన్ని అన్వేషించడానికి  అని బదులిచ్చాడు.  కాదు నువ్వు ఇక్కడ మాకు వద్దు. నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి, నా దేశం నుండి వెళ్లిపొండి అని వారిని తిట్టాడు.  కానీ ఆ భారతీయ వ్యక్తి పెద్దగా స్పందించలేదు. అయితే ఈ ఘటనను చాలా కలవరపరిచేదిగా  అక్కడి  ఎన్నారై ఛానల్ ఆ వీడియోను పంచుకుంటూ కథనం రాసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement