యుద్ద ఉద్రిక్తత.. ఇస్లామిక్ దేశాల కీలక సమావేశం | Pakistan hosts Saudi turkey Egypt ministers islamabad | Sakshi
Sakshi News home page

యుద్ద ఉద్రిక్తత.. ఇస్లామిక్ దేశాల కీలక సమావేశం

Mar 30 2026 1:00 AM | Updated on Mar 30 2026 1:00 AM

 Pakistan hosts Saudi turkey Egypt ministers islamabad

పశ్చిమాసియా యుద్దం నానాటికీ తీవ్రతరమవుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చల రాగం పాడుతున్నా పరిస్థితుల్లో ఏ మాత్రం పరిస్థితులు నానాటికీ దిగజారతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ కీలక సమావేశం నిర్వహించింది.

సౌదీఅరేబియా, టర్కీ, ఈజిప్టు, పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రులు ఇస్లామాబాద్‌లో నేటినుంచి  రెండురోజుల పాటు రౌండ్‌ టేబుల్ సమావేశం జరపనున్నారు. ప్రస్తుతం యుద్ధం తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్య సయోధ్య కుదిర్చేలా చర్చలు జరపునున్నట్లు సమాచారం.

పాకిస్థాన్‌కు  అటు ఇరాన్, ఇటు అమెరికాతో సత్సంబంధాలు ఉండడంతో ఈ రెండు దేశాల మధ్య "కమ్యూనికేషన్ బ్రిడ్జ్" లా వ్యవహరిస్తోందని ఇస్లామిక్ దేశాలు భావిస్తున్నాయి. అయితే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇదివరకే  అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడివాన్స్ తో ఈ  విషయమై నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఇస్లామిక్ దేశాల ప్రతిపాదనలను  ఇది వరకే  వైట్ హౌస్‌కు పంపారు. ఏప్రిల్ 6 లోపు షిప్పింగ్ మార్గాలను తెరవాలని డోనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల పాక్‌కు చెందిన చమురు నౌకను ఇరాన్‌ పేల్చివేసింది. కానీ పాకిస్థాన్‌ మాత్రం ఇరాన్‌తో సత్సంబంధాలున్నాయని బీరాలు పలుకుతుంది ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement