జేడీవాన్స్‌ విమానానికి స్పెషల్ ఎస్కార్ట్‌.. వీడియో వైరల్‌ | pakistan f16 escort jd vances aircraft | Sakshi
Sakshi News home page

జేడీవాన్స్‌ విమానానికి స్పెషల్ ఎస్కార్ట్‌.. వీడియో వైరల్‌

Apr 11 2026 4:07 PM | Updated on Apr 11 2026 4:25 PM

 pakistan f16 escort jd vances aircraft

ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. హైలెవల్ డెలిగేషన్ కావడంతో చర్చలు జరిగే ఇస్లామాబాద్ ప్రాంతం మెుత్తం ఆ దేశ ఆర్మీ కంట్రోల్‌లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కీలక భద్రత కలిపించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇరాన్‌- అమెరికా మధ్య పాకిస్థాన్‌లో జరిగే చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో ఏం జరగనుందా అనే అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏ‍ర్పాటు చేశారు. చర్చలలో పాల్గొనడానికి వచ్చే ప్రతినిధులకు సైతం పాక్‌ ప్రత్యేక భద్రత కల్పించింది.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ ప్రయాణించిన యుఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌ బోయింగ్‌ సీ-32ఏ విమానం పాకిస్థాన్‌ గగనతలంలోకి ప్రవేశించగానే ఆ దేశానికి చెందన ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్స్‌ ఎస్కార్ట్‌గా ప్రత్యేక భద్రత కల్పించాయి. ఏవైనా అనుకోని ఘటనలు జరగకుండా ఉండే ఉద్దేశంతోనే ఈ రకమైన భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు నిన్న ఇరాన్‌ ప్రతినిధులకు సైతం పాక్‌ అత్యంత పటిష్టమైన ఎస్కార్ట్‌ ఏర్పాటు చేసింది.ఇజ్రాయెల్‌తో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్‌ ఫైటర్‌ జెట్‌లను ఇరాన్‌ పంపి ఐరన్‌ ఎస్కార్ట్‌ ఏర్పాటు చేసింది.

కాగా ప్రస్తుతం పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్ షరీప్‌ ఇరాన్ ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు. వీరితో సమావేశం ముగిసిన అనంతరం అమెరికా ప్రతినిధులతో భేటీ అవనున్నట్లు సమాచారం. రెండు దేశాలతో పరోక్ష చర్చలు ముగిసిన అనంతరం ప్రధాన చర్చలు ప్రారంభం అవనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement