‘మీరు యుద్ధంలో పాల్గొంటారా?.. లేదు.. ఇంగ్లండ్ పారిపోతా’ | Pak MPs funny reply to India Pak war query goes viral | Sakshi
Sakshi News home page

మీరు యుద్ధంలో పాల్గొంటారా?.. లేదు.. ఇంగ్లండ్ పారిపోతా: పాక్‌ ఎంపీ

May 4 2025 4:23 PM | Updated on May 4 2025 4:55 PM

Pak MPs funny reply to India Pak war query goes viral

కరాచీ:  తమపై భారత్ యుద్ధానికి దిగితే ఏంటనే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ లో కనిపిస్తోంది. భారత్ తో పోరాడే పూర్తి శక్తి సామర్థ్యాలు ఏ రకంగా చూసే పాక్ కు లేవు. పైకి ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ నిజంగా భారత్ యుద్ధానికి దిగితే మాత్రం తమకు చుక్కలే కనిపిస్తాయనే భావన కొందరి నాయకుల్లో కనిపిస్తోంది.  

నాలుగు రోజుల క్రితం  ఒక పాక్ ఎంపీ చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ. ఒకవేళ తమతో భారత్ యుద్ధానికి దిగితే తాను ఇంగ్లండ్ కు పారిపోతానంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ ఎంపీ సరదాగా చేసినా సీరియస్‌ గా ఈ వ్యాఖ్యలు చేసినా ప్రస్తుత పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని చేతగాని ప్రభుత్వంగానేఅభివర్ణించినట్లు ఆయన మాటల్లో కనబడుతోంది. 

పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి చెందిన ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్.. ఈ వ్యాఖ్యలు చేశారు.  ఒక లోకల్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సదరు ఎంపీ ఈ కామెంట్స్ చేశారు. పాక్ పై భారత్ యుద్ధానికి దిగితే మాత్రం తాను ఇంగ్లండ్ వెళ్లిపోతానంటూ తేల్చిచెప్పారు.

ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని వెనక్కి తగ్గమని చెప్పొచ్చు కదా.. అని అడిగిన మరో ప్రశ్నకు ‘నేను చెబితే  వినడానికి.. మోదీ జీ  ఏమైనా మా బంధువా.? అంటూ చమత్కరించారు ఎంపీ  షెర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్.

 

ప్రస్తుతం పాక్ జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఎంపీ  షెర్ అఫ్జల్ ఖాన్.  పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) తరఫున ఆయన ఎంపీగా ఉన్నారు. గతంలో  అంటే ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ఎంపీ హవా నడిచేది. పీటీఐలో కీలకంగా వ్యవహరించేవారు షెర్ ఆఫ్జల్ ఖాన్,.

గత కొన్నినెలలుగా ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు అఫ్జల్ ఖాన్,. ఈ క్రమంలోనే భారత్ తో యుద్ధాన్ని పాక్ తట్టుకోలేదనే సంకేతం వచ్చేలా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఎంపీ అఫ్జల్ ఖాన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement