
70 మంది మృతి
కైరో: సూడాన్‌లోని పారామిలటరీ గ్రూప్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్‌ఎస్‌ఎఫ్) శుక్రవారం ఓ మసీదుపై జరిపిన దాడిలో కనీసం 70 మంది చనిపోయారు. ఉత్తర దార్ఫుర్ ప్రాంతంలోని ఎల్ ఫషెర్‌లో శుక్రవారం ఉదయం ప్రార్థనల సమయంలో ఘటన చోటుచేసుకుంది.
డ్రోన్ దాడి తీవ్రతకు మసీదు పూర్తిగా నేలమట్టమైందని స్థానికులు తెలిపారు. ఎల్ ఫషెర్ సమీపంలో రెండు పక్షాల మధ్య గత వారం నుంచి భీకర దాడులు జరుగుతున్నాయి. సూడాన్ ఆర్మీ, ఆర్‌ఎస్‌ఎఫ్ మధ్య 2023 నుంచి జరుగుతున్న ఆధిపత్య పోరుతో కనీసం 40 వేల ప్రాణాలు కోల్పోయారు. కోటి మందికి పైగా నిరాశ్రయులయ్యారు.