ఉటా ఎడారి: ఎలా వచ్చిందో.. అలానే వెళ్లింది | Monolith Vanishes From US Desert | Sakshi
Sakshi News home page

‘ఏలియన్స్‌ వచ్చి తీసుకెళ్లాయేమో’

Nov 30 2020 2:39 PM | Updated on Nov 30 2020 2:47 PM

Monolith Vanishes From US Desert - Sakshi

వాషింగ‍్టన్‌: అమెరికాలోని ఉటా ఎడారిలో కొద్ది రోజుల క్రితం ఓ వింత వస్తువు ప్రత్యక్షమయిన సంగతి తెలిసిందే. 12 అడుగుల పొడవున్న ఈ లోహపు దిమ్మె నర సంచారం లేని ఆ ఎడారిలోకి ఎలా వచ్చేందనే విషయం ఇంకా మిస్టరీగానే ఉండగా... తాజాగా మరో వింత చోటు చేసుకుంది. ప్రస్తుతం ఉటా ఎడారిలో ప్రత్యక్షమైన ఆ దిమ్మె కనిపించకుండా పోయింది. దాంతో తప్పకుండా ఇది ఏలియన్స్‌ పనే అంటున్నారు నెటిజనులు. ఈ నేపథ్యంలో ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ బ్యూరో అధికారులు ‘ఒక్కరు లేదా కొందరు వ్యక్తులు కలిసి ఈ దిమ్మెను శుక్రవారం రాత్రి తొలిగించినట్లు మాకు తెలిసింది’ అన్నారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం.. ‘లోహపు దిమ్మెను తొలగించారు. బ్యూరో ఆఫ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా పాతిన లోహపు దిమ్మెను తొలగించినట్లు మా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది’ అని దానిలో పేర్కొన్నారు. ఈ నిర్మణాన్ని తొలగించినట్లు ఉటా హైవే పాట్రోల్‌ సీపీఎల్‌ అధికారి ఒకరు ఆదివారం వాషింగ్టన్‌ పోస్ట్‌కు తెలియజేశారు. అయితే ఎవరు దాన్ని తొలగించారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ విషయం జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. (చదవండి: ఏముంది.. అక్కడే పడుకో: భార్య)

‘అసలు ఆ దిమ్మెను ఎడారిలో ఎవరు నిలబెట్టారు.. ఇప్పుడు ఎవరు తొలగించారు. అంతా మాయాలా ఉంది’ అంటూ ఆశ్చర్యం వ్యక్యం చేస్తున్నారు జనాలు. ప్రస్తుతం దీని గురించి ఇంటర్నెట్‌లో తెగ చర్చ నడుస్తోంది. ‘ఏలియన్స్‌ వచ్చి దాన్ని తీసుకెళ్లాయి’.. ‘ఇప్పుడు ఆ దిమ్మె మరో చోట ప్రత్యక్షం అవుతుందేమో’.. ‘ఆ దిమ్మె ఏలియన్స్‌కు సంబంధించిన వస్తువు. అందుకే అధికారుల సీక్రేట్‌గా దాన్ని తొలగించారు.. దాని ఏం మాట్లాడటం లేదు’ అంటూ నెటిజనులు కామెంట్‌ చేస్తున్నారు. ఈ నెల 18న కొందరు కార్మికులు ఈ నిర్మణాన్ని గమనించారు. రెడ్‌ రాక్‌ రిమోట్‌ ఏరియాలో దిమ్మె ప్రత్యక్షం అ‍య్యిందని తెలిపారు. నాటి నుంచి ఈ దిమ్మె తెగ వైరలయ్యింది. ఇక ఈ దిమ్మె ఎక్కడ ఉంది అనే దాని గురించి ఉటా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సేఫ్టీ వాళ్లు ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చే అవకాశం ఉండటంతో సమాచారాన్ని గోప్యంగా ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement