పాక్‌లో ‘ఎంపాక్స్‌’  | Measles outbreak in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌లో ‘ఎంపాక్స్‌’ 

Apr 6 2026 4:46 AM | Updated on Apr 6 2026 4:46 AM

Measles outbreak in Pakistan

వైరస్‌తో నలుగురు శిశువుల మృతి  

కరాచీ: పాకిస్తాన్‌లో ప్రమాదకరమైన ఎంపాక్స్‌ వైరస్‌ వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఏడుగురు శిశువులు మరణించగా వారిలో నలుగురికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. సింధ్‌ ప్రావిన్స్‌లోని ఖైర్‌పూర్‌లో ఎంపాక్స్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. పుండ్లు, ఫ్లూ లక్షణాలు, జ్వరంతో బాధపడుతూ ఖైర్‌పూర్‌లో ఆసుపత్రులల్లో చేరిన శిశువులు మరణించారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఎంపాక్స్‌ సోకిన మనుషులు, జంతువులకు దగ్గరగా ఉంటే వైరస్‌ వ్యాప్తి చెందుతుంది.

 శిశువుల మృతికి ఎంపాక్స్‌ ఒక్కటే కారణం కాదని ఆరోగ్య శాఖ పేర్కొంది. వారు నెలలు నిండకముందే జని్మంచారని, తక్కువ బరువు ఉన్నారని, అనారోగ్య సమస్యలు బాధపడుతున్నారని తెలియజేసింది. సింధ్‌ ప్రావిన్స్‌లో అసాధారణమైన చర్మపు మొటిమలు, పుండ్లతో బాధపడుతున్న 15 మంది పిల్లలను ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎంపాక్స్‌ బాధితుల కోసం ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement