
వాషింగ్టన్: భారత్- అమెరికా మధ్య సుంకాల వివాదం నడుస్తున్న తరుణంలో భారత అనుసంధానకర్త జాసన్ మిల్లర్ వాషింగ్టన్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు పలువురు అధికారులను కలుసుకున్నారు. ట్రంప్ యంత్రాంగంతో దౌత్యపరమైన సంబంధాలను నెరవేర్చేందుకు భారత్ కొన్ని నెలల క్రితం జాసన్ మిల్లర్‌ను అనధికారిక అనుసంధానకర్తగా నియమించుకుంది.
అధ్యక్షుడు ట్రంప్‌ను కలుసుకున్న మిల్లర్ ‘ఎక్స్’లో ఒక ఫోటోను షేర్ చేస్తూ, వాషింగ్టన్‌లో అధ్యక్షుడు ట్రంప్‌ను కలుసుకునే అవకాశం లభించింది. పలువురు అధికారులను కూడా కలుసుకున్నాను. గొప్ప పనికి ఇది నాంది కానుంది’ అని రాశారు. ఈ సమావేశానికి సంబంధించిన అధికారిక ఎజెండాను మిల్లర్ వెల్లడించనప్పటికీ, అమెరికా-భారత ద్వైపాక్షిక ఆర్థిక వ్యూహాలు మరోసారి చర్చల్లోకి వచ్చాయి. అలాగే ట్రంప్, మిల్లర్‌ల భేటీ కీలకంగా మారింది. ట్రంప్‌కు సన్నిహితుడైన మిల్లర్ భారత్‌కు దౌత్యపరమైన అనుసంధాన కర్తగా వ్యవహరిస్తున్నారు.
Fantastic week in Washington with so many friends being in town, topped off of course by having the opportunity to stop in and see our President in-action!
Keep up the great work, @POTUS @realDonaldTrump! pic.twitter.com/G28hsKTUgd— Jason Miller (@JasonMiller) September 6, 2025
రాజకీయ వ్యూహకర్త, జాసన్ మిల్లర్ 2016, 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారాల్లో డోనాల్డ్ ట్రంప్‌కు సీనియర్ సలహాదారుగా పనిచేశారు. కాగా పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఈ పరిణామాల గురించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) మిల్లర్‌కు పరిస్థితి గురించి నిశితంగా వివరించింది. మిల్లర్ ఈ పరిణామాలను అమెరికా అధికారులకు తెలియజేశారు. ఈ నేపధ్యంలో అమెరికా కాంగ్రెస్‌లోని 100 మందికి పైగా సభ్యులు భారతదేశానికి మద్దతు ప్రకటించారు.