అదిగదిగో గ్రీన్‌ కార్డు

Joe Biden admn introduces ambitious immigration bill in Congress - Sakshi

ఫలించనున్న భారతీయుల ఎదురుచూపులు

కాంగ్రెస్‌లో పౌరసత్వ బిల్లుని ప్రవేశపెట్టిన బైడెన్‌ సర్కార్‌

వాషింగ్టన్‌: అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశించిన గ్రీన్‌ కార్డు కోసం భారతీయులు ఇకపై ఏళ్లకి ఏళ్లు ఎదురు చూసే పని లేదు. వేలాదిమంది భారతీయ టెక్కీలు, వారి కుటుంబసభ్యులతో పాటు విదేశీయులెందరికో లబ్ధి చేకూరేలా బైడెన్‌ సర్కార్‌ అడుగు ముందుకు వేసింది. గ్రీన్‌కార్డుపై దేశాల కోటా పరిమితిని ఎత్తేయడంతో పాటుగా దేశంలో చట్టవిరుద్ధంగా తలదాచుకుంటున్న 1.1కోట్ల మంది అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి వీలు కల్పించే అమెరికా పౌరసత్వ బిల్లు 2021ని గురువారం కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును కాంగ్రెస్‌ ఉభయ సభలు ఆమోదించి, అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేస్తే అమెరికాలో ఉంటున్న వేలాదిమంది భారతీయ ఐటీ నిపుణులకి, వారి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. 

దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారితో పాటు  చట్టబద్ధంగా ఉంటున్న వారికి కూడా లబ్ధి చేకూరేలా ఈ బిల్లుని రూపొందించారు. దీనిని సెనేటర్‌ బాబ్‌ మెనెండెజ్, కాంగ్రెస్‌ సభ్యురాలు లిండా సాంచెజ్‌లు చట్టసభలో ప్రవేశపెట్టారు. వలస విధానంలో సమూల సంస్కరణల ద్వారా వలసదారుల్లో భయం లేకుండా వారికి ఆర్థిక భద్రత కల్పించేలా అమెరికా పౌరసత్వ బిల్లు 2021ని తీసుకువచ్చినట్టుగా వారు మీడియాకు చెప్పారు. ‘‘నా తల్లిదండ్రులు మెక్సికో నుంచి వచ్చారు. ఈ దేశంలో వలసదారులు భయాందోళనలు లేకుండా జీవించేలా వలస విధానాన్ని రూపొందించడానికే నేను శ్రమిస్తున్నాను’’ అని సాంచెజ్‌ అన్నారు. వలస దారులంటే పొరుగువారు, స్నేహితులని చెప్పారు. కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు పూర్తి మెజారిటీ ఉంది. ఎగువ సభ అయిన సెనేట్‌లో రెండు పార్టీలకు 50 చొప్పున సీట్లు ఉన్నాయి. సెనేట్‌లో ఈ బిల్లు పాస్‌ కావాలంటే మరో 10 మంది రిపబ్లికన్ల మద్దతు అవసరం.  

వారి కలలు నెరవేరుద్దాం: బైడెన్‌

దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుదన్నుగా ఉన్న వలసదారుల సంక్షేమం కోసం రిపబ్లికన్లు ఈ బిల్లుకి మద్దతునిస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం అధ్యక్షుడు జో బైడెన్‌ గత ప్రభుత్వ తప్పిదాలను సరవిస్తూ వలసదారులకి న్యాయం జరిగేలా చూద్దామని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వలస కుటుంబాలను కలుపుతూ వారికి భద్రమైన జీవితాన్ని ఇవ్వడానికి మానవత్వంతో కూడిన వలస విధానాన్ని ముందుకు తీసుకువెళదామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘వలస విధానంలో సంస్కరణల వల్ల అమెరికాలో ఉండాలనుకునే వారి కలలు ఫలించి, మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఈ సంస్కరణలు డెమొక్రాట్లు, రిపబ్లికన్ల ప్రాధాన్యత కాదు. అమెరికా ప్రజల ప్రాధాన్యం కోసమే  ఈ బిల్లుని తెచ్చాం. మన దేశం కోసం కష్టపడే వారి కలలు తీరుద్దాం’’ అని బైడెన్‌ వివరించారు.  

బిల్లులో ఏముంది ?
► గ్రీన్‌కార్డు మంజూరులో ఏడుశాతం దేశాల కోటాను ఎత్తేస్తూ  మొదట దరఖాస్తు చేసుకునే వారికి మొదట గ్రీన్‌కార్డు జారీ చేసేలా నిబంధనల్లో మార్పు చేశారు. దీంతో పదేళ్లకు పైబడి గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు బిల్లు చట్టరూపం దాల్చగానే లబ్ధి చేకూరనుంది

► హెచ్‌1–బీ వీసాదారుల  జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది. గతంలో ట్రంప్‌ ప్రభుత్వం ఈ వర్క్‌ ఆథరైజేషన్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే.

► విదేశాల్లో పుట్టి తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో ఉంటున్న పిల్లలందరికీ వారి వయసుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం కల్పించే అన్ని సదుపాయాలు లభిస్తాయి.

► అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న  1.1 కోట్ల మంది అక్రమ వలసదారులకి మూడేళ్లలో పౌరసత్వం లభిస్తుంది.

► ఎల్‌జీబీటీక్యూ హక్కుల పరిరక్షణ, వారి కుటుంబసభ్యులకి, అనాథలకి చట్టపరమైన రక్షణ కలుగుతుంది.

► అమెరికా యూనివర్సిటీల్లో చదివే విదేశీ విద్యార్థుల్లో స్టెమ్‌ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌) కోర్సులు చేసేవారికి దేశంలో  ఉండడం మరింత సులభంగా మారనుంది

► పరిశ్రమల్లో తక్కువ వేతనానికి పని చేసే కార్మికులకు కూడా గ్రీన్‌కార్డులు ఇచ్చే వెసులుబాటు ఉంటుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top