లండన్‌లో యూదు అంబులెన్సులు దగ్ధం | jewish community ambulances set on fire in london | Sakshi
Sakshi News home page

లండన్‌లో యూదు అంబులెన్సులు దగ్ధం

Mar 25 2026 1:00 AM | Updated on Mar 25 2026 1:09 AM

 jewish community ambulances set on fire in london

లండన్‌లో యూదు  స్వచ్ఛంద సంస్థకు చెందిన నాలుగు అంబులెన్సులను గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. దీంతో అందులోని సిలిండర్లు పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనను ఆదేశ ‍ప్రధాని కీర్ స్మార్టర్ ఖండించారు.

యూదు జనాభా ఎక్కువగా ఉండే లండన్‌లోని గోల్డర్స్ గ్రీన్  ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. గత సోమవారం తెల్లవారు జామున దుండగులు ఈచర్యకు పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో అత్యవసర సమయంలో వైద్య సహాయం అందించే నాలుగు  అంబులెన్స్‌లు దగ్ధమయ్యాయి. వాహనాల్లోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో పక్కనే ఉన్న భవనాల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి.

ఈ ఘటనను ఆదేశ్ ప్రధాని  కీర్ స్టార్మర్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.  ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా గత రెండేళ్లలో బ్రిటన్‌లో యూదులకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులు భారీగా పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. 2022లో 1,662 ఘటనలు నమోదు కాగా, 2025 నాటికి ఆ సంఖ్య 3,700కు పెరిగిందని నివేదికలు  పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement