రోజూ 8 గ్లాసుల నీళ్లు తాగాలా? ఎక్కువగా తాగడం వల్ల ఈ సమస్య రావొచ్చు!

How Much Water Should You drink Every Day Know Details - Sakshi

‘ఎన్నినీళ్లు తాగితే అంత మంచిది’ మనం తరచూ వినేమాట. అసలు ఒక వ్యక్తి రోజుకెన్ని నీళ్లు తాగాలన్న చర్చ నిత్యం జరుగుతూనే ఉంది.  ఒక మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ కనీసం రెండు లీటర్లు అంటే.. ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలని వైద్యులు, నిపుణులు చెప్పేమాట. అయితే.. అన్ని నీళ్లు అవసరం లేదని ఓ అధ్యయనం చెబుతోంది. అబెర్డీన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేశారు.

23 దేశాల నుంచి 5,604 మంది అన్ని వయసులవారిని పరిశీలించారు. ఈ సర్వే ప్రకారం ఒకటిన్నర లీటర్లు తాగితే సరిపోతుందని చెబుతున్నారు. నీళ్లు ఎక్కువగా తాగితే ఓవర్‌హైడ్రేషన్‌ అయి దానివల్లా సమస్యలొస్తాయని వివరించారు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు, శారీరక శ్రమ చేసేవాళ్లు.. ఈ గ్లాసుల సంఖ్య పెంచాలని సూచిస్తున్నారు. అథ్లెట్లు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు నీళ్లు ఎక్కువ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

‘బరువును బట్టి నీళ్లు తాగాలి.. 20 కిలోల బరువుకు లీటర్‌ చొప్పున.. 40 కిలోల బరువుంటే రెండు లీటర్లు, 80 కిలోలుంటే 4 లీటర్లు తాగాలి’ అని అబెర్డీన్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ జాన్‌ స్పీక్‌మాన్‌ చెబుతున్నారు. అయితే ఈ పరిమాణం మీరు తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుందట. 
చదవండి: ఇరాన్ ఫుట్ బాల్ జట్టు ఓటమి.. స్వదేశంలో సంబరాలు.. కారణం ఇదే!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top