2021: ప్రపంచం అతలాకుతలమేనట! | Great Disasters, Cataclysm: Blind Baba Vanga Predictions 2021 | Sakshi
Sakshi News home page

2021: ప్రపంచం అతలాకుతలమేనట!

Dec 26 2020 5:34 PM | Updated on Dec 27 2020 6:39 PM

Great Disasters, Cataclysm: Blind Baba Vanga Predictions 2021 - Sakshi

బాబా వంగ.. బహుశా చాలామందికి ఆమె పేరు తెలిసుండదు. కానీ ఒక్కసారి ఆమె గురించి తెలిస్తే మాత్రం అంత ఈజీగా మర్చిపోలేరు. ఇంతకీ ఆమెలో అంత ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా?

బాబా వంగ.. బహుశా చాలామందికి ఆమె పేరు తెలిసుండదు. కానీ ఒక్కసారి ఆమె గురించి తెలిస్తే మాత్రం అంత ఈజీగా మర్చిపోలేరు. ఇంతకీ ఆమెలో అంత ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా? మరేం లేదు. మన దగ్గర పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా ఆమె కూడా కాలజ్ఞాని. భవిష్యత్తులో జరగబోయే వాటిని ఆమె ముందే అంచనా వేసి చెప్పగా, వాటిలో చాలావరకు నిజమయ్యాయట. మరి ఆమె 2021 సంవత్సరం గురించి ఏం చెప్పిందో తెలుసుకునే ముందు ఆమెవరో? కాలజ్ఞానిగా ఎలా మారిందో ముందుగా తెలుసుకుందాం.. (చదవండి: అరుదైన చిత్రాన్ని ఇన్‌స్టాలో పోస్ట్‌​ చేసిన నాసా)

చూపు పోయింది కానీ..
బల్గేరియాకు చెందిన బాబా వంగ అసలు పేరు వెంజీలియా పెండెవా దిమిత్రోవా. పన్నెండేళ్ల వయసులో వచ్చిన టోర్నడో ఆమె చూపును మింగేసింది. కానీ ఆశ్చర్యంగా రానున్న కాలంలో ఏం జరగనుందనే విషయాలను కళ్లకు కట్టినట్లు చెప్పే అద్భుత శక్తిని పొందింది. దీంతో ఆమెను బల్గేరియాలో నోస్ట్రడామస్‌(ఫ్రెంచ్‌ కాలజ్ఞాని)తో సమానంగా చూసేవారు. ఆమె ఎన్నో విపత్తులు, వైపరీత్యాలను ముందుగానే చెప్పేవారట. ఈ క్రమంలో ఆమె చెప్పిన సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్‌ అణు ప్రమాదం, పుతిన్‌పై హత్యాయత్నం అన్నీ నిజంగానే జరిగి తీరాయి. 1996లో ఆమె మరణించేముందు 2021లో జరగబోయేవాటి గురించి తెలిపింది. (వైరల్‌ : 100 ఏళ్లుగా అది ఒంటరి ఇళ్లు)

క్యాన్సర్‌కు మందు రాబోతుందా?
2021లో ప్రకృతి విధ్వంసం భారీగా జరగబోతుందని హెచ్చరించింది. జనాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారని ఊహించింది. వినాశకరమైన ఘటనలతో ప్రపంచం అతలాకుతలం అవుతుందని పేర్కొంది. అదే సమయంలో క్యాన్సర్‌ మహమ్మారి సంకెళ్లను తెంచుకుని మానవాళి బయటపడుతుందనే శుభవార్తను కూడా అందించింది. అంటే రానున్న రోజుల్లో క్యాన్సర్‌కు నివారణ ఔషధం ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చింది. పెట్రోల్‌ ఉత్పత్తి ఆగిపోయి పుడమి తల్లి విశ్రాంతి తీసుకోనుందని ఉద్ఘాటించింది. ఆ సమయంలో రైళ్లు సోలార్‌ శక్తితో నడుస్తాయంది. కొందరు ప్రజలు రెడ్‌ మనీ వాడుతారంది. ఈ ప్రపంచాన్ని అంతటినీ ఓ డ్రాగన్‌ తన గుప్పిట్లోకి తీసుకుంటుందని, దీని ఎదుర్కొనేందుకు మూడు దిగ్గజ దేశాలు ఏకమవుతాయని చెప్పింది. అలాగే ఆ మూడు దిగ్గజాలను చైనా, ఇండియా, రష్యాగా భావిస్తున్నారు. ఇక 2341 నాటికి భూమి నివాసయోగ్యానికి పనికి రాకుండా పోతుందని కూడా చెప్పింది. అయితే 2021లో ఆమె చెప్పిన శుభ శకునాలు మాత్రమే నిజమైతే ఎంత బాగుండో అనుకుంటున్నారు జనాలు. (చదవండి: ఆయన లగ్జరీ చూస్తే.. బిలియనీర్లకు కూడా షాకే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement