జెన్‌-జెడ్‌ తిరుగుబాటు.. మెక్సికో నేషనల్ ప్యాలెస్‌ వద్ద టెన్షన్‌ | Gen Z–led Protest in Mexico City, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Mexico Gen Z Protest: జెన్‌-జెడ్‌ తిరుగుబాటు.. మెక్సికో నేషనల్ ప్యాలెస్‌ వద్ద టెన్షన్‌

Nov 16 2025 9:57 AM | Updated on Nov 16 2025 10:41 AM

Gen Z–led Protest in Mexico City, Video Goes Viral

మెక్సికో: మెక్సికోలో జెన్‌-జెడ్‌ నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. జెన్‌-జెడ్‌, పోలీసులు మధ్య ఘర్షణల కారణంగా దాదాపు వంద మందికి పైగా పోలీసులు గాయపడ్డినట్టు సమాచారం. నిరసనకారులు మెక్సికో కార్యనిర్వాహక శాఖకు చెందిన నేషనల్ ప్యాలెస్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మెక్సికోలో పెరుగుతున్న నేరాలు, అవినీతి పెరిగిపోయినా శిక్షలు లేకపోవడాన్ని వ్యతిరేకిస్తూ జెన్‌ జెడ్ నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో గత అక్టోబర్‌లో పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రగతిశీల రాజకీయ నాయకురాలు, ప్రెసిడెంట్ క్లాడియా షీన్‌బామ్‌ అధికారిక నివాసమైన నేషనల్ ప్యాలెస్‌లోకి దూసుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. వేల సంఖ్యలో జన సమూహం వీధుల్లోకి వచ్చారు. నిరసనకారుల్లో చాలామంది షీన్‌బామ్ రాజీనామాకు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా నిరసనకారులకు ప్రతిపక్ష పార్టీల నుంచి బలమైన మద్దతు సైతం లభించింది.

దీంతో, ప్యాలెస్ చుట్టూ ఉన్న పోలీసు బారికేడ్‌లను తొలగించాడానికి నిరసనకారులు ప్రయత్నించారు. వెంటనే అధికారులు స్పందించి జనంపైకి టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో వారంతా పరుగులు తీశారు. అనంతరం, ఒక గుంపు మెక్సికన్ పోలీసు అధికారిని జనంలోకి లాగి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు గంటల తరబడి కొనసాగాయి. ఈ క్రమంలో మెక్సికో సిటీ చీఫ్ ఆఫ్ పోలీస్ పాబ్లో వాజ్క్వెజ్ మాట్లాడుతూ.. నిరసనకారుల్లో 20 మందిని అరెస్టు చేశామన్నారు. దాడుల కారణంగా పోలీసు అధికారులలో 60 మంది గాయపడ్డారని, వారిలో 40 మందిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. 
 

నిరసనలు ఎందుకు?
నవంబర్ 1న మిచోకాన్‌లోని ఉరుపాన్ మేయర్ కార్లోస్ మాంజో హత్య తర్వాత ఉద్యమం పెరిగింది. అతను తన కుటుంబంతో కలిసి డే ఆఫ్ ది డెడ్ ఉత్సవానికి హాజరైనప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై ఏడుసార్లు కాల్పులు జరిపారు. దీంతో, అతని మరణం యువతకు ఆగ్రహాన్ని తెప్పించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement