Dubai Police Arrests Us Woman For Screaming In Public - Sakshi
Sakshi News home page

పబ్లిక్ లో గొడవ చేసినందుకు అమెరికా టిక్ టాక్ స్టార్ అరెస్టు 

Jul 20 2023 2:14 PM | Updated on Jul 20 2023 2:16 PM

Dubai Police Arrests Us Woman For Screaming In Public - Sakshi

దుబాయ్: అమెరికా టిక్ టాకర్ ఎరక్కపోయి దుబాయ్ లో ఇరుక్కుపోయింది. తన స్నేహితుడితో జాలీ ట్రిప్ కోసం యూఏఈ వెళ్లిన టియెర్రా యంగ్ అలెన్ అనుకోకుండా అక్కడ యాక్సిడెంట్ చేసింది. తర్వాత అనవసరంగా అద్దె కార్ షోరూం యజమానిపై నోరు జారి న్యూసెన్స్ చేసి జైలు పాలయ్యింది.  

అమెరికాకు చెందిన టిక్ టాక్ స్టార్ టియెర్రా యంగ్ అలెన్(29) యూఏఈ పర్యటనకు వచ్చి చిక్కుల్లో పడింది. దుబాయ్ లో తన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంటుకు గురి కావడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవింగ్ చేస్తున్నందుకు బాయ్ ఫ్రెండ్ ను అరెస్టు చేశారు. టిక్ టాకర్ స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. 

అంతకు ముందు  అద్దెకు కారు తీసుకున్నప్పుడు షోరూంలో ఇద్దరూ తమ గుర్తింపు కార్డులు అక్కడ వారికిచ్చారు. మరుసటి రోజున అమెరికా తిరిగి ప్రయాణమవ్వనున్న నేపథ్యంలో అలెన్ కారు షోరూంకి వెళ్లి తన ఐడెంటిటీ కార్డులు తనకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ ఆ కార్ షోరూం యజమాని కేసు తేలేంత వరకు అవి ఇవ్వడం కుదరదని చెప్పడంతో టిక్ టాకర్ రెచ్చిపోయింది. షోరూం యజమానిపై చిర్రుబుర్రులాడి గట్టి గట్టిగా అరుస్తూ గొడవ చేసింది. దీంతో దుబాయ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.     

ఇది కూడా చదవండి: ట్రాక్ దాటుతున్న ట్రక్కును ఢీకొట్టిన రైలు.. 

Advertisement
 
Advertisement
Advertisement