భారత ప్రధాని నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒస్పేసుకున్నారా?, త్వరలో భారత్‌తో వాణిజ్య చర్చలకు సిద్ధమవుతున్న ట్రంప్.. మోదీపై ప్రశంసలకు కారణం ఏమిటి?, భారత్‌తో స్నేహ హస్తాన్ని కాదనుకుంటే తమకే ముప్పు తప్పదని ట్రంప్ గ్రహించారా?, వీటికి మరింత బలం చేకూరుస్తూ దక్షిణకొరియా వేదికగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
‘నాకు మోదీతో మంచి రిలేషన్ ఉంది. ఆయన చూడటానికి చాలా సౌమ్యంగా కనిపిస్తారు. తండ్రిలా కనిపిస్తారు. కానీ ఆయనతో అంత ఈజీ కాదు. మోదీ అంటే నరకం కంటే కఠినం. ఆయనొక ‘కిల్లర్’’ అంటూ కొనియాడారు. ఇక్కడ కిల్లర్ అనే కాస్త వివాదాస్పదంగా కనిపిస్తున్నప్పటికీ ఎక్కడా కూడా వెనుకడుగేసి నైజం మోదీలో లేదనేది ట్రంప్ చెప్పకనే చెప్పేశారు.
దక్షిణ కొరియాలోని గ్యోంగ్జులో జరిగిన ఆసియన్-పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ (APEC) సీఈఓల సమ్మిట్‌లోట్రంప్ మాట్లాడుతూ.. మోదీని ఆకాశానికెత్తేశారు. భారత–అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరిగే అవకాశముందని చెప్పారు ట్రంప్.- పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల సమయంలో మోదీతో జరిగిన సంభాషణను సైతం వివరించారు ట్రంప్. ఆ సమయంలో మోదీ తనతో మాట్లాడిన శైలిని సైతం ట్రంప్ అనుకరించారు.


