డెన్మార్క్‌ ప్రధానిపై దాడి | Danish PM Mette Frederiksen suffers minor whiplash from Copenhagen attack | Sakshi
Sakshi News home page

డెన్మార్క్‌ ప్రధానిపై దాడి

Jun 9 2024 5:35 AM | Updated on Jun 9 2024 5:35 AM

Danish PM Mette Frederiksen suffers minor whiplash from Copenhagen attack

కోపెన్‌హాగెన్‌/న్యూఢిల్లీ: డెన్మార్క్‌ ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడెరిక్సన్‌(46)పై దాడి జరిగింది. శుక్రవారం ఆమె రాజధాని కోపెన్‌హాగెన్‌లోని కుల్వోర్వెట్‌ స్క్వేర్‌ వద్ద సోషల్‌ డెమోక్రాట్ల తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎదురుగా వచి్చన ఓ వ్యక్తి చేతితో ప్రధానిని భుజాన్ని బలంగా నెట్టివేశాడు. దీంతో, ఆమె పక్కకు తూలారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

 ఘటనతో ప్రధాని ఫ్రెడెరిక్సన్‌కు ఎటువంటి గాయాలు కాలేదు కానీ, షాక్‌కు గురయ్యారని ఆమె కార్యాలయం తెలిపింది. ఘటన నేపథ్యంలో శనివారం ప్రధాని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారని వివరించింది. యూరోపియన్‌ పార్లమెంట్‌కు ఆదివారం ఎన్నికలు జరగనుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫ్రెడెరిక్సన్‌పై దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement