Omicron Alert: కోవిడ్‌ బారిన పడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులు! 30 కోట్లు దాటిన కేసులు!

Covid Hospitalisation Of US Kids Soared Under Age Of Five - sakshi - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు కొనసాగుతున్నప్పటికీ శుక్రవారం నాటికి 300 మిలియన్ల (30 కోట్లు)కు పైగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యినట్లు నివేదికలు తెల్పుతున్నాయి. మరోవైపు డజన్ల కొద్ది దేశాల్లో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ శర వేగంగా వ్యాపిస్తోంది.

హాస్పిటల్లో పెరిగిన ఐదేళ్లలోపు పిల్లల చేరికలు
వాక్సిన్‌కు అర్హత వయసులేని వారికి సంబంధించిన డేటాను అమెరికా శుక్రవారం విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం గత కొద్దివారాలుగా కోవిడ్‌ మహమ్మారి బారినపడ్డ ఐదేళ్లలోపు పిల్లలు ఆసుపత్రుల్లో చేరడం పెరిగిందని తెల్పింది. అందోళనకరమైన ఈ తాజా పరిణామం దృష్ట్యా పిల్లలకు టీకాల అవసరం ఎంతైన ఉందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రోచెల్‌ వాలెన్‌స్కీ పేర్కొన్నారు. గత నెల (డిసెంబర్‌) మధ్యకాలం నుంచి దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగం పుంజుకుంది. ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల రేటు ప్రతి లక్ష పిల్లల్లో 2.5 నుంచి 4 కంటే ఎక్కువ నమోదవుతుంది. 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లల్లో ఈ రేటు లక్షమందికి గాను 1గా నమోదవుతుందని మొత్తం 14 రాష్ట్రాల్లో 250 ఆసుపత్రుల్లో సీడీసీ సేకరించిన సమాచారం ప్రకారం తయారు చేసిన డేటా తెల్పుతోంది.

నాలుగో డోస్‌ అవసరం లేదు: యూకే
మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి నాలుగో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవల్సిన అవసరం లేదని బ్రిటీష్‌ ఆరోగ్య అధికారులు (యూకే) శుక్రవారం తెలిపారు. మూడో డోస్‌ తీసుకున్న 3 నెల్ల తర్వాత 65 అంతకంటే ఎక్కవ వయసున్న వృద్ధులు ఆసుపత్రుల్లో చేరడం దాదాపు 90 శాతం తగ్గిందని యూకే హెల్త్‌ సెక్యురిటీ ఏజెన్సీ తెల్పింది.

కోవిడ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్లు దాటాయి
ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 300 మిలియన్లను దాటింది. కాగా గత వారం రోజుల్లో డజన్ల కొద్దీ దేశాలలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇన్ఫెక్షన్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అధికారిక ఏఎఫ్‌పీ గణాంకాల ప్రకారం గడచిన ఏడు రోజుల్లో మొత్తం 34 దేశాల్లో అత్యధిక సంఖ్యలో కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో యూరప్‌కు చెందినవి 18 దేశాలుకాగా, ఆఫ్రికాలో ఏడు దేశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక్కవారంలోనే 13.5 మిలియన్ల కొత్త కేసులు నమోదవ్వడాన్నిబట్టి కోవిడ్‌ ఉధృతి ఎంత వేగంగా ఉందో తెలుస్తోంది. మరణాల సగటు రేటు మాత్రం మూడు శాతం పడిపోయింది. యుఎస్, యుకె, కెనడా, ఇజ్రాయెల్ నుండి వచ్చిన డేటా ప్రకారం ఒమిక్రాన్‌తో ఆసుపత్రుల్లో చేరే ప్రమాదం 70 శాతం కంటే తక్కువగా ఉందని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ అథారిటీ శుక్రవారం తెలిపింది. ఐతే గతంలో వచ్చిన వేరియంట్లకంటే ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, తక్కువ ప్రమాదకారి అని తెలియజేసింది.

చదవండి: అమెరికా చరిత్రలో ఇది చీకటి రోజు.. డొనాల్డ్ ట్రంప్‌పై బైడెన్ తీవ్ర విమర్శలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top