చైనాలో మరో 3,472 పాజిటివ్‌ కేసులు

Coronavirus: China Reports Again Several New Positive Cases - Sakshi

బీజింగ్‌: చైనాలో గురువారం ఒక్కరోజే 3,472 కరోనా కేసులు నమోదయ్యాయి. లక్షణాల్లేని కేసులు మరో 20,782 బయటపడ్డాయి. పాజిటివ్‌ కేసుల్లో 3,200, లక్షణాల్లేని వాటిలో 19,872 షాంఘైలోనే నమోదయ్యాయి! కరోనా కట్టడికి షాంఘైలో 15 రోజులుగా కఠిన లాక్‌డౌన్‌ అమలవుతుండటం తెలిసిందే. ఇళ్ల నుంచి బయటికొచ్చే వీల్లేక, ఆహారం, అత్యవసర ఔషధాలు కూడా దొరక్క కోట్లాది మంది గగ్గోలు పెడుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం భారీగా పెంచింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top