వీడియో లైవ్ స్ట్రీమింగ్‌లో ప్రమాదం.. యువ టిక్‌టాక్‌ స్టార్‌ దుర్మరణం

Chinese TikTok Star Xiao Qiumei Falls While Recording video - Sakshi

 వీడియో లైవ్ స్ట్రీమింగ్‌ సందర‍్భంగా  ప్రమాదం

వీడియో లైవ్ స్ట్రీమింగ్‌ సందర‍్భంగా  ప్రమాదం

160 అడుగుల క్రేన్‌ నుంచి పడి టిక్‌టాక్‌ స్టార్‌ మృతి

బీజింగ్‌: లైవ్ స్ట్రీమ్ వీడియో షూట్‌ చేస్తూ చైనీస్ టిక్‌టాక్ స్టార్ జియావో క్యుమీ (23) దుర్మరణం పాలైన ఘటన షాక్‌కు గురిచేసింది.  టిక్‌టాక్‌  వీడియో రికార్డ్ చేస్తూ 160 అడుగుల నుంచి కింద పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు  కోల్పోయింది. 

ప్రొఫెషనల్ క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసే జియావో ఆ క్రేన్ నుండే పలు వీడియోలు తీస్తూ ఉండేది. ఇలా అనేక వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ స్టార్‌గా పాపులర్‌ అయింది. ఈ క్రమంలోనే సహోద్యోగులంతా  ఇంటికి వెళ్లి పోయిన తరువాత  క్రేన్ క్యాబిన్లో కూర్చుని వీడియో తీసుకోవడానికి ప్రయత్నించింది జియావో.  కానీ ఇంతలోనే అదుపు తప్పి కింద పడిపోయింది.  ఫోన్‌ చేతిలో పట్టుకుని కింద పడిపోతున్న దృశ్యాలు వీడియోలో అస్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో ఈ వీడియో వైరల్‌ అయింది. 

టిక్‌టాక్ చైనీస్ వెర్షన్‌ డౌయిన్ ప్లాట్‌ఫాంలో లక్షమంది మందికి పైగా  ఫాలోవర్లో జియావో క్యుమీ చైనాలో అత్యంత ప్రజాదరణ పొందారు.  ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఈమె డ్యాన్స్ వీడియోలు కూడా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాయి. దీంతో జియావో ఆకస్మిక మరణం అభిమానులను తీవ్ర విషాదంలోకి ముంచింది. కాగా ఇటీవల హాంగ్‌కాంగ్‌కు చెందిన డేర్‌డెవిల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ సోఫియా చుంగ్‌ జలపాతం సమీపంలో ఇన్‌స్టాగ్రామ్ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top