ఆంక్షలను ఎత్తివేశాక..చైనాలో ఘోరంగా పెరుగుతున్న కరోనా కేసులు

Chinas Covid 19 Gloom Deepens After Lifting Curbs - Sakshi

చైనాలో ప్రజలు, విద్యార్థులు బహిరంగంగా ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఆంక్షలు సడలించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అనూహ్యంగా చైనాలో కరోనా కేసులు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి.  చైనా రోజువారిగా చేసే సాధారణ కరోనా పరిక్షలు రద్దు చేశాక వెల్లువలా కేసులు పెరిపోవడం ప్రారంభమైంది. ఈ మేరకు పలువురు అంటువ్యాధుల నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో బీజింగ్‌లో పలు దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అదీగాక వ్యాధి సోకిన వారు గృహ నిర్బంధలో ఉండటంతో కొన్ని వ్యాపారాలు మూతబడగా...మరికొన్ని దుకాణాలు కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వచ్ఛందంగా మూసేశారు.

ఈ మేరకు చైనీస్‌ ఎపిడెమియాలజిస్ట్‌ జాంగ్‌ నాన్షాన్‌ మాట్లాడుతూ...చైనాలో ప్రస్తుతం ఓమిక్రాన్‌ ప్రభలంగా వ్యాపిస్తోంది. కనీసం ఒక్కరూ దీని భారిన పడ్డా.. అతను సుమారుగా 18 మందికి సంక్రమింప చేయగలడని అన్నారు. ఇప్పటికే ప్రధాన నగరాల్లో సుమారు 10 వేల మందికి పైగా ప్రజలకు సోకినట్లు జాంగ్‌ చెప్పారు. మరోవైపు ఆరోగ్య కార్యకర్తలు నివాసితులకు సాధారణ కరోనా పరీక్షలు నిర్వహించడం మానేశాక కొత్తకేసులకు సంబంధించిన అధికారిక లెక్కలు కూడా కనుమరగయ్యాయి.

ప్రసత్తం ఆరోగ్య అధికారులు చెప్పిన గణాంకాల ప్రకారం సుమారు 1,661 కొత్త కేసులు ఉన్నాట్లు వెల‍్లడించారు. బీజింగ్‌లో ఆదివారం అత్యధిక జనాభ కలిగిన చాయోయాంగ్‌లోని మాల్స్‌లో పలు దుకాణాలు మూతబడి నిర్మానుష్యంగా ఉన్నాయి. ప్రస్తుతం చైనా ఆర్థిక పరిస్థితి కూడా మందగమనంలో ఉంది. దీనికి తోడు మొన్నటివరకు ఉన్న జీరో కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయాలు కూడా అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం మళ్లీ కరోనా విజృంభిస్తున్న తరుణంలో రానున్న పరిస్థితుల్లో వ్యక్తిగత ఆదాయాలు మరింత ఘోరంగా ఉంటాయని ఆర్థికవేత్త మార్క్‌ విలియమ్స్‌ చెబుతున్నారు.

క్యాపిటల్ ఎకనామిక్స్ ప్రకారం, చైనా ఆర్థిక వ్యవస్థ 2023 మొదటి త్రైమాసికంలో 1.6%గా రెండవ త్రైమాసికంలో 4.9% వృద్ధి ఉంటుందని అంచానా వేసింది.  సాధారణ స్థితికి రావడానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుందని విలయమ్స్‌ చెప్పారు. చైనా కొన్ని ఆంక్షలు సడలించినప్పటికీ పర్యాటకులతో సహా విదేశీయులు రాకుండా సరిహద్దులను మూసివేసే ఉంచింది. చైనా ప్రయాణికులైన తప్పనిసరిగా కేంద్రీకృత ప్రభుత్వ సౌకర్యాల వద్ద ఐదు రోజులు నిర్బంధంలో ఉండి, ఇంటి వద్ద మరో మూడు రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందే. చైనా జీరో కోవిడ్‌ పాలసీని సడలించినప్పటికీ కొన్నింటి విషయాల్లో ఆంక్షలు పూర్తిగా సడలించలేదు.

(చదవండి: చమురు విషయంలో పాక్‌కి గట్టి షాక్‌ ఇచ్చిన రష్యా)

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top