ట్రంప్‌ ఎఫెక్ట్.. యుద్ధంలోకి మరో దేశం? | British submarine in the Arabian Sea | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ఎఫెక్ట్.. యుద్ధంలోకి మరో దేశం?

Mar 22 2026 10:06 AM | Updated on Mar 22 2026 11:37 AM

British submarine in the Arabian Sea

పశ్చిమాసియా యుద్ధంలో మరో దేశం దిగనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. బ్రిటిష్‌కు చెందిన ఓ అణు జలాంతర్గామిని  అరేబియా సముద్రంలో మోహరించినట్లు డేలీ మెయిల్ కథనం పేర్కొంది.  దీనితో ఈ క్షణాన్నైనా ఇరాన్‌పై దాడులు చేసే అవకాశం ఉందని సమచారం.

నాటో దేశాలపై ట్రంప్ ఇటీవల తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. హార్మూజ్ జలసంధి విషయంలో అవి స్పందించడం లేదని వారంతా పిరికి వాళ్లన్నారు. అమెరికా లేని నాటో ఏందుకు పనికి రాదని పేపర్‌ పులి లాంటిదని అభివర్ణించారు. ఈ సందర్భాన్ని గుర్తు పెట్టుకుంటామని హెచ్చరిస్తూ తన అధికారిక సోషల్ మీడియా గ్రూప్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ స్పందించినట్లు తెలుస్తోంది.

బ్రిటన్ అరేబియా సముద్రంలో ఒక అణుశక్తితో నడిచే జలాంతర్గామిని మోహరించిందని  డైలీ మెయిల్ కథనం పేర్కొంది. ఈ సబ్‌మెరైన్‌లో టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను దాడికి సిద్ధంగా ఉంచిందని తెలిపింది. హెచ్‌ఎంఎస్ ఆన్సన్ అనే జలంతార్గామి మార్చి 6న ఆస్ట్రేలియా నుంచి బయిలుదేరిందని  అరేబియా సముద్రంలోని పరిస్థితులను వివరించేందుకు ప్రతి 24 గంటలకోకసారి హెచ్ఎంఎస్ ఆన్సన్ ఉపరితలానికి వస్తున్నట్లు డైలీమెయిల్ కథనం ప్రచురించింది.

కాగా  బ్రిటన్‌, అమెరికాకు చెందిన ద్వీపం డీగో గార్సియాపై దాడి చేసింది. నాలుగువేల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌పై అటాక్ చేసింది. ఇరాన్‌పై దాడికి డీగో గార్సియా ద్వీపం ఉపయోగించుకోవచ్చని బ్రిటన్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. కాగా ఇప్పుడు బ్రిటన్ సైతం నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement