కూలిన అగ్నిమాపక విమానం, 8 మంది దుర్మరణం

Bedrive Be 200 Amphibious Aircraft Has Crashed In Turkey - Sakshi

ఇస్తాంబుల్‌: టర్కీ అడవుల్లో చెలరేగిన మంటలను అర్పేందుకు రష్యా నుంచి వచ్చిన యాంఫిబియస్‌ బెరివ్‌ బీఈ–200 అగ్నిమాపక విమానం కుప్పకూలిన ఘటనలో 8 మంది మరణించారు. ఈ ఘటన దక్షిణ టర్కీలోని అదానా ప్రావిన్సులో చోటు చేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రమాదాన్ని పరిశీలించేందుకు దర్యాప్తు బృందం ఘటనా స్థలానికి బయలుదేరిందని టర్కీ ప్రభుత్వ మీడియా తెలిపింది. ప్రమాదం పట్ల టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుత్‌ కావుసోగ్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి త్యాగాలను టర్కీ మరచిపోదని వ్యాఖ్యానించారు. ప్రమాదానికి ముందు విమానంతో కమ్యూనికేషన్‌ తెగిపోయిందని, ఆ తర్వాత విమానం కూలినట్లు తెలిసిందని స్థానిక గవర్నర్‌ ఒమర్‌ ఫరూక్‌ కోస్కున్‌ తెలిపారు.

ఈ ప్రమాదం పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంతాపం వ్యక్తం చేశారు.  ఇందులో టర్కీ పౌరులు మరణించడంపై టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌కు పుతిన్‌ తన సంతాపం తెలిపారు. ఈ  రెండు ఇంజిన్లు కలిగిన యాంఫిబియస్‌ అగ్నిమాపక విమానం 270 మెట్రిక్‌ టన్నుల నీటిని మోసుకెళ్లగలదు. 

చదవండి :  చూపుడు వేలుపై 3 గంటలకు పైగా

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top