మేకపై ఐదుగురు అత్యాచారం.. ప్రధానిపై వ్యంగ్యాస్త్రాలు

5 Men Allegedly Molested, Later Killed A Goat In Pakistan Okara - Sakshi

రోజులు గడుస్తున్న కొద్దీ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే నీచ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధులు జంతువులను కూడా వదలడం లేదు. ఇప్పటి వరకు ఆడవారికే భద్రత కరువుతుందనుకుంటున్న నేటీ కాలంలో జంతువులకు కూడా రక్షణ  లేకుండా పోతుంది. తాజాగా ఓ మేకపై, కామంతో కళ్లు ముసుకుపోయిన కొందరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అవమానవీయ ఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

ఒకారా జిల్లాలోని ఓ కార్మికుడు ఇంటి ముందు ఉన్న కాంపౌండ్‌లోని మేకను అపహరించిన అయిదుగురు వ్యక్తులు దానిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన తర్వాత మేకను చంపేశారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పారిపోవడం స్థానికుల కంటపడింది. ప్రస్తుతం ఈ ఘటన పాకిస్తాన్‌లో చర్చనీయాంశంగా మారింది. అఘాయిత్యాన్ని వ్యతిరేకిస్తూ అనేకమంది సోషల్‌ మీడియాలో నిరసనలు తెలుపుతున్నారు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ఇప్పుడు చెప్పండి ప్రధాని గారూ. మేకలు కూడా వాటి వస్త్రాధరణ కారణంగానే అత్యాచారానికి గురవుతున్నాయి కదా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.  

పాకిస్తానీ నటి మథిర.. మేకపై అఘాయిత్యానికి సంబంధించిన న్యూస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. జంతువులకు కూడా దుస్తులు ధరించడం అవసరం అంటూ సెటైర్లు పేల్చారు. మరొకరు...‘నగ్న జంతువులు కూడా పురుషులపై ప్రభావం చూపుతాయా? ఇప్పుడు మన అందమైన ప్రధాని... మేకలను కూడా పూర్తి దుస్తులు ధరించాలని అడుగుతాడు. ఎందుకంటే చుట్టుపక్కల వారిని చూసి రెచ్చిపోకుండా ఉండేందుకు.. అమాయకులైన పురుషులు రోబోలు కాదు కదా’. అంటూ చురకలంటించారు.

కాగా గత నెలలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మహిళల దుస్తులపై తీవ్రంగా కామెంట్‌ చేశారు.  ఆడవారు పూర్తిగా వస్త్రాలు ధరించాలని, వారి వేషధారణ ఎదుటివారిని రెచ్చగొట్టేలా ఉండకూడదని వ్యాఖ్యానించారు. మహిళల పొట్టి బట్టలు చూసి రెచ్చిపోకుండా ఉండేందుకు మగవారేం రోబోలు కాదు అంటూ పేర్కొన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దూమారమే రేగింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top