
ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే
వాషింగ్టన్ : దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేరాల కారణంగా.. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న పోలీసుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2022 సంవత్సరంలో మొత్తం 46 మంది పోలీసులు హత్యకు గురి కాగా.. 2021 సంవత్సరంలో జులై నెల వరకు 37 మంది హత్యకు గురయ్యారని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే తెలిపారు. గురువారం హౌస్ ఓవర్ సైట్ కమిటీ మీటింగ్‌లో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు వృత్తిలో ఉన్న ఇతర ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య 121గా ఉందన్నారు.
కారు యాక్సిడెంట్లు, నీటిలో మునిగిపోతున్న వారిని కాపాడే క్రమంలో చనిపోవటం, కరోనా ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన వారు వీరిలో ఉన్నారన్నారు. 2021లో మొత్తం 148 మంది పోలీసులు మరణించారని నేషనల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్స్ మెమోరియల్ ఫండ్ తెలిపింది. 2022లో 12 నెలల కాలంలో 134 మంది మృతి చెందారని వెల్లడించింది. ట్రాఫిక్ మరణాలు 42 శాతం పెరిగాయని పేర్కొంది.