షాకింగ్‌.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ

22 Foot Python Entirely Swallows 5 Year-Old Woman Alive in Indonesia - Sakshi

బల్లులు, కప్పలు, ఎలుకలు, చేపలు, కీటకాలు వంటి చిన్న చిన్న జంతువులను పాములు ఆహారంగా తినడం సహజం. పెద్ద జంతువుల జోలికి అవి పోవు. అదే కొండచిలువ విషయానికొస్తే మొత్తం భిన్నంగా ఉంటుంది. ఏది దొరికితే అది ఇట్టే పట్టేసుకుంటుంది. పట్టు వదలకుండా బలంగా చుట్టుకొని ఆహారంగా చేసుకుంటుంది. ఇటీవల మొసలి, కోతి, మేకలు కొండచిలువ మింగేసిన ఘటనలు చూస్తూ ఉన్నాం. వీటిని తిన్న తర్వాత అవస్థ పడి పాము మరణించిన ఘటనలూ లేకపోలేదు.

తాజాగా ఓ కొండచిలువ ఏకంగా మనిషినే మింగేసింది. 22 అడుగుల భారీ కొండచిలువ సంజీవంగా ఉన్న 54 ఏళ్ల మహిళను మింగింది. ఈ షాకింగ్‌ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. ఆగ్నేమ సులవేసి ప్రావిన్స్‌లోని మునా ద్వీపంలో తన గ్రామ సమీపంలో ఉన్న కురగాయల తోటలో పని నిమిత్తం వెళ్లిన మహిళ కనిపించకుండా పోయింది. మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఆమె తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. తోట వద్దకు వెళ్లి వెతగ్గా మహిళకు చెందిన చెప్పులు, ఫ్లాష్‌లైట్‌తోపాటు కొన్ని వస్తువులు దొరికాయి. 

దీంతో మరోసారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మహిళ కోసం గాలించగా  ఆమె వస్తువులు దొరికిన ప్రాంతానికి కొంత దూరంలో ఓ భారీ కొండచిలువ కనిపించింది. అది చూడటానికి ఉబ్బిన కడుపుతో ఉండటంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. వెంటనే కొండచిలువను చంపి దాన్ని కోయడంతో కడుపులో నుంచి మహిళ మృతదేహం బయటపడింది.

కొండచిలువ పొట్టలో మహిళ దుస్తులతో సహా చెక్కుచెదరకుండా అలాగే ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ముందుగా మహిళ తల మింగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారాయి. కాగా ఈ ఘటన ఇప్పటిది కాదని, పాతదని పలువురు నెటిజన్లు చెబుతున్నారు. మరికొంత  మంది ఇది ఎప్పుడు జరిగిన కొండచిలువ మనుషులను మింగడం  సాధారణ విషయం కాదని, ఫోటోలు చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుందని కామెంట్‌ చేస్తున్నారు.
చదవండి: రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్‌ ఘటన.. ఆసుపత్రికి షాకిచ్చిన అధికారులు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top