అమ్మవార్లకు కోటి దండాలు | - | Sakshi
Sakshi News home page

అమ్మవార్లకు కోటి దండాలు

May 18 2026 10:43 AM | Updated on May 18 2026 10:43 AM

అమ్మవార్లకు కోటి దండాలు

రాష్ట్రంలోనే 7, 8 స్థానాల్లో బల్కంపేట ఎల్లమ్మ,

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి ఆలయాలు

ఏడాదిలో రూ.24 కోట్లకు పైగా ఆదాయం

బంజారాహిల్స్‌: దేవాదాయ శాఖ రూపొందించిన 2025–26 ఆర్థిక సంవత్సరం అంచనా నివేదిక ప్రకారం నగరంలోని బల్కపేట శ్రీ ఎల్లమ్మ, జూబ్లీహిల్స్‌ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయాల ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. దర్శనం టికెట్లు, హుండీ కానుకలు, ప్రసాద విక్రయాలు, వివిధ సేవల ద్వారా బల్కంపేట శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి రూ.12.56 కోట్లు, జూబ్లీహిల్స్‌ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయానికి రూ.12.21 కోట్లు సమకూరాయి. గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం గణనీయంగా పెరగడం విశేషం. రాష్ట్రంలోని టాప్‌– 10 ఆదాయం వచ్చే దేవాలయాల్లో 7వ స్థానంలో బల్కంపేట ఎల్ల్మమ్మ, 8వ స్థానంలో జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి దేవాలయాలు చోటు సంపాదించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement