సమాజంలో బాధ్యతగా మెలగాలి | - | Sakshi
Sakshi News home page

సమాజంలో బాధ్యతగా మెలగాలి

Feb 13 2026 5:35 AM | Updated on Feb 13 2026 5:35 AM

సమాజంలో బాధ్యతగా మెలగాలి

సమాజంలో బాధ్యతగా మెలగాలి

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రమేష్‌

మణికొండ: సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలిగాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం. రమేష్‌ అన్నారు. గురువారం సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనరేట్‌ ఆ విర్భావ దినోత్సవం సందర్భంగా నార్సింగి సైకిల్‌ట్రాక్‌ వద్ద యువతకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించటంతో పాటు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసు శాఖ అనేక భద్రతా చర్యలు, సామాజిక బాధ్యతలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా గాయకులు పాడిన పలు పాటలకు యువకులతో పాటు కమీషనర్‌ సైతం స్టెప్పులేశారు. అనంతరం యువకులతోతో కలిసి సైక్లింగ్‌ చేశారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్‌ శ్రీనివాస్‌, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌, సీఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ డీసీపీ సాయి మనోహర్‌, ఏడీసీపీలు, ఏసీపీలు, పోలీసు సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement