ఆటోల్లో ‘ఆపత్కాల బృందాలు’ | - | Sakshi
Sakshi News home page

ఆటోల్లో ‘ఆపత్కాల బృందాలు’

Feb 12 2026 11:34 AM | Updated on Feb 12 2026 11:34 AM

ఆటోల్లో ‘ఆపత్కాల బృందాలు’

ఆటోల్లో ‘ఆపత్కాల బృందాలు’

ఆటోల్లో ‘ఆపత్కాల బృందాలు’

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నిలక బందోబస్తు విధుల్లో స్ట్రైకింగ్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్సులు ఓ భాగం. తాత్కాలిక ప్రాతిపదికన గస్తీ విధుల కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. ఎక్కడా శాంతిభద్రతల సమస్య, ఘర్షణలు, ఆందోళనలు తలెత్తితే వెంటనే రంగంలోకి దిగి అదుపు చేయడం, ఆందోళనకారుల్ని ముందస్తు అరెస్టు చేయడం వీరి విధి. ఇప్పటి వరకు ఈ రెండు రకాలైన బృందాలను కారు, సుమో తదితర వాహనాలు కేటాయించే వారు. వీటివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని గమనించిన సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ ఎం.రమేష్‌ తొలిసారిగా ట్రాలీ ఆటోలు కేటాయించారు. ఈ కమిషనరేట్‌ పరిఽధిలో పోలింగ్‌ జరిగిన ప్రాంతాల్లో స్ట్రైకింగ్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ బృందాలు ఆటోల్లోనే గస్తీ, బందోబస్తు నిర్వహించాయి. ఈ వాహనాల్లో తిరగడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు వీరికి స్పష్టంగా కనిపిస్తాయి. అక్కడి పరిస్థితుల్ని పక్కాగా అంచనా వేయవచ్చు. ఈ బృందాల వెంట ఉండే లాఠీలు, స్టోర్‌ గార్డ్‌, హెడ్‌ గార్డ్‌లతో పాటు రైట్‌ గేట్‌ మొత్తాన్ని తరలించడమూ తేలిక. అత్యవసరం అయినప్పుడు వాటిలో నుంచి దిగటానికీ సమయం పట్టదు. అవసరమైతే ఆందోళనకారుల్ని తమ ఆటోలోనే తీసుకుని మరో ప్రాంతానికి తరలించవచ్చు. ఈ కారణాల వల్ల సైబరాబాద్‌ సీపీ ఈ రెండు తరహాలైన బృందాలకు ట్రాలీ ఆటోలు కేటాయించారు.

ఎన్నికల విధుల్లో స్ట్రైకింగ్‌,స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లు

తొలిసారిగా ఆటోలను కేటాయించిన సైబరాబాద్‌ సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement