
‘జూబ్లీహిల్స్ లయన్స్’ సేవలు భేష్
మాదాపూర్: విద్యార్థుల సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లయన్స్ క్లబ్ సేవాతత్పరతను చాటుకుంది. ఈ మేరకు మాదాపూర్‌లోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల కోసం ఐరన్ షెడ్ నిర్మించారు. శనివారం ఈ షెడ్‌ను లయన్స్ జిల్లా గవర్నర్ 320డి లయన్ అమర్‌నాథ్‌రావు ప్రారంభించారు. ఈ నిర్మాణానికి లయన్ గిరిజారెడ్డి, డాక్టర్ పి.సీత, జయశ్రీ మూర్తి, జ్వాలా వైష్ణవి, మండవ శిల్ప విరాళాలు అందించారు. విద్యార్థుల సౌకర్యం కోసం నిర్మించిన ఈ షెడ్..విద్యాభివృద్ధికి లయన్స్‌క్లబ్ చూపుతున్న అంకితభావానికి నిదర్శనమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు లయన్ కోనేరు రామసుందరి, కార్యదర్శి లయన్ రిందా దేవి, హెడ్మాస్టర్ మోహన్‌రావు, నరసింహరాజు, రామమోహన్, సౌభాగ్య, మర్రి ప్రవీణ్, ఈవీ రమణ తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన...
మాదాపూర్‌లోని మండల ప్రాథమిక పరిషత్ స్కూల్‌లో లయన్స్‌క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320డి అధ్వర్యంలో శనివారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. లయన్ నాగరాజు, నరసింహరాజు, పద్మావతి త్రిపురనేనిలు మానసిక ఆరోగ్యంపై మార్గనిర్దేశం చేయగా, తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ సెంటర్, అంబర్‌పేట్ నిపుణులు విద్యార్థులకు సైబర్‌క్రైమ్స్, డ్రగ్స్ దుష్ఫలితాలపై అవగాహన కల్పించారు. ఫోరెన్సిక్, కెరీర్ ప్రోగ్రెస్‌పై సుశ్మిత, సైబర్ ముప్పు, హ్యాకింగ్‌పై రాహుల్ వివరించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ క్లబ్ అధ్యక్షుడు కోనేరు రామ సుందరి, హెడ్మాస్టర్ బసవలిగం తదితరులు పాల్గొన్నారు.
మాదాపూర్ స్కూల్‌లో ఐరన్ షెడ్ ఏర్పాటు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన