
‘విజయ్ శంకర్‌లాల్ జ్యువెలరీ’ నగలు దొరికాయి
● రూ.1.50 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
లక్డీకాపూల్: బషీర్‌బాగ్‌లోని విజయ్ శంకర్‌లాల్ జ్యువెలరీలో ఈ నెల 5న చోరీకి గురైన రూ.1.50 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు దొరికాయని, ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి తెలిపారు. గురువారం ఆమె ఇక్కడ వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ బెట్టింగ్‌లో భారీగా నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ముంబైకి చెందిన రోనక్ చడ్వా గత ఏప్రిల్‌లో జ్యువెలరీ షాపులో పనికి చేరాడు. తనతో పాటు బెట్టింగ్‌లో నష్టపోయిన మహ్మద్ హస్నైన్ హబియాతో కలిసి కుట్రపన్ని ఈ నెల 5న జ్యువెలరీ షాపులో దొంగతనం చేశారు. దీనిపై 7న బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీసీఎస్‌తో కలిసి సైఫాబాద్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఆభరణాలను రోనక్, మహ్మద్ హస్నైన్ హబియా దొంగిలించినట్లు గుర్తించి అరెస్టు చేశామని, నేరస్తులను ఏసీజేఎం కోర్టులో హాజరుపరిచామన్నారు. ఆభరణాలన్నీ చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. నగరంలో నగల దుకాణాల్లో పనిచేసే వారిని సమగ్రంగా విచారించిన తర్వాతే నియమించుకోవాలని డీసీపీ సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ బీ.ఆనంద్ ,సైఫాబాద్ ఏసీపీ ఆర్. సంజయ్ కుమార్, సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్ కే. రాఘవేందర్, డీఐ ఎన్. రాజేందర్, డీఐ సైఫాబాద్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.