
శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలోఅసాధారణ వృద్ధి
● గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
లాలాపేట: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం అసాధారణ వృద్ధిని సాధిస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు. ఈ మేరకు సీఎస్‌ఐఆర్–ఐఐసీటీలో జరుగుతున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ ఆండ్ డెవలప్‌మెంట్ 6వ ప్రాంతీయ సదస్సులో రెండో రోజు గురువారం గవర్నర్ పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు. దేశంలో పరిశోధనలు, పేటెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. స్థిరమైన, నైపుణ్యంతో కూడిన సమానమైన ఆర్థికాభివృద్ది కోసం నూతన ఆవిష్కరణలు పెరగాలన్నారు. పరిశోధన, అభివృద్ధిని సులభతరం చేయడానికి విద్యా వ్యవస్థను సంస్థాగతంగా మెరుగుపరచాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, పద్మ అవార్డు గ్రహీత అనిల్ కకోద్కర్, నీతి ఆయోగ్ గౌరవ సభ్యుడు డాక్టర్ వి.కె సారస్వత్, నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు ప్రొఫెసర్ వివేక్ కుమార్ సింగ్, పలువురు శాస్త్రవేత్తలు, వివిధ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు.