
కోకాపేటలో చకచకా
ప్రారంభోత్సవాలు.. ఆవిష్కరణ.. వీక్షణలతో సీఎం రేవంత్‌రెడ్డి సందడి చేశారు. ముందుగా ఆయన సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కోకాపేటలో టోల్‌గేట్‌ను ప్రారంభించారు. 4.55 గంటలకు గండిపేటకు చేరుకుని గోదావరి జలాల తరలింపుపై జలమండలి అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని వీక్షించారు. నగర వ్యాప్తంగా గతంలో నిర్మించిన 12 రిజర్వాయర్‌లను ప్రారంభించారు. అనంతరం గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం సభా వేదికపైకి వచ్చిన ఆయన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. సభ అనంతరం ముఖ్యమంత్రి 5.30 గంటలకు ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. కొత్తగా ప్రారంభించిన కోకాపేట టోల్‌గేట్ ద్వారా ఔటర్ రోడ్డు మీదుగా వెళ్లారు. – మణికొండ

కోకాపేటలో చకచకా