అన్నదాతలప్రయోజనాలే ముఖ్యం
● రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: రైతుల ప్రయోజనాల కోసం మార్కెట్ కమిటీలు పనిచేయాలని, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. సోమవారం బాటసింగారం పండ్ల మార్కెట్‌ను సందర్శించిన ఆయన బత్తాయి రైతులతో ముచ్చటించారు. ఉద్యానవన పంటలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్ర భుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమ లు చేస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని మార్కెట్ కమిటీల పనితీరును కమిషన్ సమీక్షిస్తుందని చెప్పారు. కోహెడలో త్వరలోనే మార్కెట్ నిర్మా ణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
కమిషన్‌కు విన్నపం
కొత్తపేట నుంచి పండ్ల మార్కెట్‌ను తాత్కాలిక ప్రాతిపదికన బాటసింగారానికి మార్చినప్పటికీ, వ్యాపారానికి అనువైన వాతావరణం లేదని కమిషన్ ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని, మార్కెట్ యార్డులోని సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు సునీల్‌రెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర చారి, సభ్యులు అంజయ్య, మధుసూదన్‌రావు, రఘుపతిరెడ్డి, లక్ష్మి, మచ్చేందర్ రెడ్డి, నర్సింహ, గణేష్ నాయక్, గోవర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర్లు గుప్తా, ఇబ్రహీంతోపాటు మార్కెట్ ఈఈ ప్రసాద్ రావు, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్, ఫ్రూట్ ట్రేడర్స్ అఽధ్యక్షుడు మహ్మద్ తాజ్, ఉపాధ్యక్షుడు అచ్చ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


