
నిర్మాత అల్లు అరవింద్‌కు షోకాజ్ నోటీసులు
బంజారాహిల్స్: నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేపట్టిన ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన భవనానికి ఎందుకు కూల్చవద్దో చెప్పాలంటూ జీహెచ్‌ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ అధికారులు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45లో సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన 8–2–293/82/775/ఏ లో 996 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్లాట్ ఉంది. సదరు స్థలంలో అల్లు అరవింద్ నిర్మాతగా గీత ఆర్ట్స్ కార్యాలయం కొనసాగుతోంది. ఈ భవన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి రెండు సెల్లార్లతో పాటు జీ ప్లస్ 4 అనుమతులు పొందారు. అయితే అనుమతులకు విరుద్ధంగా ఒక అంతస్తును అక్రమంగా నిర్మించారు. ఈ విషయాన్ని గుర్తించిన జీహెచ్‌ఎంసీ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేస్తూ ఎందుకు కూల్చవద్దో చెప్పాలంటూ పేర్కొన్నారు. ప్లాన్‌కు విరుద్ధంగా అక్రమ అంతస్తు ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించారు.