
తార్నాక జంక్షన్ క్లోజ్
నేటి నుంచి పాత పద్ధతిలోనే..
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రయోగాత్మకంగా తెరిచిన తార్నాక జంక్షన్‌ను ఇక మూసివేయనున్నారు. అక్కడి వాస్తవ పరిస్థితులతో పాటు ఇతక కారణాల నేపథ్యంలో ప్రస్తుతం ఆ చౌరస్తా అటు పోలీసులు, ఇటు వాహనచోదకులకు చుక్కలు చూపిస్తోంది.
బుధవారం ‘జంక్షన్లో ‘జామ్’జాటం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ గురువారం ఆ ప్రాంతానికి వెళ్లారు. క్షేత్రస్థాయిలో అనేక అంశాలను అధ్యయనం చేశారు. దీంతోపాటు వివిధ మార్గాల్లో అధ్యయనం చేసిన అధికారులు శుక్రవారం నుంచి తార్నాక జంక్షన్‌ను మూసేయాలని, పాత పద్ధతిలోనే వాహనాల రాకపోకలు పునరుద్ధరించాలని నిర్ణయించారు.