సూట్‌కేస్‌లో మహిళ శవం.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

సూట్‌కేస్‌లో మహిళ శవం.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

Jun 6 2025 7:40 AM | Updated on Jun 6 2025 7:40 AM

సూట్‌కేస్‌లో మహిళ శవం.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

సూట్‌కేస్‌లో మహిళ శవం.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

నిజాంపేట్‌: బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసిన ‘సూట్‌కేస్‌లో మహిళ శవం’ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వివరాలివీ... నేపాల్‌కు చెందిన తార బెహార(33), విజయ్‌తోఫా(30)లు నేపాల్‌లోని పక్కపక్క గ్రామాల వారు. తార బెహార్‌కు ఇదివరకే వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విడిపోయి జీవనం సాగిస్తోంది.

● ఇదిలా ఉండగా తార బెహార, విజయ్‌తోఫాల మధ్య పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరు ఏప్రిల్‌ 4న జూబ్లీహిల్స్‌లోని విజయ్‌ తోఫా తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. అక్కడి నుంచి 45 రోజుల క్రితం బౌరంపేట్‌లోని ఇందిరమ్మ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. విజయ్‌ తోఫా స్థానికంగా ఓ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తార బెహార్‌ గర్భం దాల్చింది. గర్భం విషయంలో వారి మధ్య గొడవ జరుగుతోంది. గర్భం తీసేసుకుంటానని తార బెహార్‌... వద్దంటూ విజయ్‌ తోఫా వాదిస్తుండటంతో ఇద్దరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవ మే 22న తీవ్ర స్థాయికి చేరింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విజయ్‌ తోఫా... తార బేహార్‌ను ఇంట్లోనే ఉరి వేసి చంపేశాడు. శవాన్ని ఓ పెద్ద సూట్‌కేసులో కుక్కి అర్ధరాత్రి ఇందిరమ్మ కాలనీకి అనుకుని ఉన్న నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లి పడేశాడు. 26వ తేదీన ఇంటిని ఖాళీ చేసి జూబ్లీహిల్స్‌లోని తన కుటుంబం వద్దకు వెళ్లాడు.

● కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్యాగ్‌ స్కాడ్‌ను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. డాగ్‌లు ఇందిరమ్మ కాలనీ వైపు వెళ్లడంతో దర్యాప్తును ఆ దిశగా చేపట్టారు. గండిమైసమ్మ నుంచి బాచుపల్లి, మియాపూర్‌ నుంచి బాచుపల్లి వైపు ప్రధాన రోడ్డుపై ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.

● శవం పూర్తిగా కుళ్లిపోవడంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేవలం గాజులు, కలర్‌ఫుల్‌ డ్రెస్‌ల ఆధారంగా పోలీసులు మృతురాలు ఇతర రాష్ట్రానికి చెందినదిగా భావించారు. ఈ క్రమంలో ఆమె నేపాల్‌వాసిగా నిర్ధారణ అయ్యింది.

గోల్డెన్‌ కలర్‌ హ్యాండిలే ఆధారంగా...

మృతదేహాన్ని సూట్‌ కేసులో తీసుకురావడంతో పోలీసులు సూట్‌కేస్‌ దిశగా సైతం విచారణ చేపట్టారు. అక్కడ లభించిన సూట్‌కేసు ఖరీదైనది.. అందులో కొత్తగా ఉంది. హ్యాండిల్‌ కొత్తగా ఉండటంతో పోలీసులు ప్రగతినగర్‌, మియాపూర్‌, నిజాంపేట్‌ కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లోని లెదర్‌ బ్యాగ్‌లు, సూట్‌కేసుల షాపుల్లో విచారణ ప్రారంభించాడు. పదిహేను రోజుల క్రితం పెద్ద సూట్‌ కేసులు ఎవరెవరు కొన్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చివరకు బాచపల్లి చౌరస్తాలోని ఓ లెదర్‌ షాపులో ఈ నెల 23న విజయ్‌ తోఫా పెద్ద సూట్‌ కేసు కొన్నట్లు సీసీ ఫుటేజీ లభించింది.

ర్యాపిడోతో ‘బుక్‌’అయ్యాడు...

సూట్‌కేస్‌ను కొన్న విజయ్‌ తోఫా ర్యాపిడో బైక్‌ బుక్‌ చేశాడు. ఆ ర్యాపిడో బైక్‌ ఆధారంగా పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా అతడు ఇందిరమ్మ కాలనీకి చేరుకున్నట్లు తెలిసింది. ర్యాపిడో నుంచి సమాచారం తీసుకుని నేరస్తుడి నెంబర్‌ను ట్రేస్‌ చేశారు. అప్పటికే అతని సెల్‌ ఫోన్‌ స్విచ్ఛాప్‌లో ఉంది. ఈ క్రమంలో సాంకేతిక అంశాలతో గంటల వ్యవ్యధిలో కనుకుని జూబ్లీహిల్స్‌లో విజయ్‌ తోఫా కుటుంబం ఉందని నిర్ధారించుకున్నారు. నిఘా పెట్టి విజయ్‌ తోఫాను గురువారం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

గర్భం విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చివరకు హత్య

అర్ధరాత్రి శవాన్ని ఎత్తుకుని 2 కిలో మీటర్లు నడిచి పొదల్లో పడేసిన వైనం

పోలీసుల అదుపులో నిందితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement