
రేపు తాగునీటి సరఫరాలో అంతరాయం
సాక్షి, సిటీబ్యూరో: గోదావరి తాగునీటి సరఫరా పథకంలో భాగంగా హైదర్ నగర్ నుంచి అల్వాల్ వరకు 1200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌కు షాపూర్ నగర్ వద్ద మరమ్మతు పనులు చేపడుతున్న నేపథ్యంలో శనివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 9 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలివే..
నగర శివారులోని షాపూర్‌నగర్, సంజయ్ గాంధీ నగర్, కళావతి నగర్, హెచ్‌ఎంటీ సొసైటీ, హెచ్‌ఏఎల్ కాలనీ, టీఎస్‌ఐఐసీ కాలనీ, రోడమేస్త్రి నగర్, శ్రీనివాస్ నగర్, ఇందిరానగర్, గాజులరామారం, శ్రీ సాయి హిల్స్, దేవేందర్ నగర్, కై లాస్ హిల్స్, బాలాజీ లేఅవుట్, కై సర్ నగర్, గాజులరామారం తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి స్పష్టం చేసింది.