
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు దంచికొడుతున్నాయి. కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం విశాఖపట్నం సమీపంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో కొనసాగుతోంది. మరో ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌గడ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడింది. వీటి ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు చోట్ల అతి భారీ నుంచి, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
It's 2:30AM & Just Pouring here in #Jeedimetla 🌧️💥 #Hyderabadrains pic.twitter.com/v1kjMHiWEK
— Hyderabad Rains (@Hyderabadrains) July 22, 2025
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు అలర్ట్ విధించింది. అలాగే, ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విధించగా.. మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక, మంగళవారం వికారాబాద్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. మద్గుల చిట్టెంపల్లిలో 8.3 సెం.మీ, ధారూర్‌లో 8 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.
దయచేసి అప్రమత్తంగా ఉండండి, లోతట్టు ప్రాంతాల నుండి తక్షణమే ఖాళీ చేయండి ⚠️⚠️
ములుగు, వరంగల్ బెల్ట్ అంతటా తీవ్రమైన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వెంకటాపురంలో 136మి.మీ నమోదై, రానున్న గంటలలో 200మి.మీ వర్షపాతం కూడా సులువుగా దాటబోతోంది ⚠️⚠️⛈️⛈️⚠️
రానున్న 12 గంటల్లో, 150-200… https://t.co/YvS6t8kNjo— Telangana Weatherman (@balaji25_t) July 22, 2025

మరోవైపు.. ఏపీలో మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 40నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు విస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అనేక చోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. అదేవిధంగా దక్షిణకోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
🔴 LPA to form near NAP will give Severe rainfall over Telugu states 👇Precipitation forecast for July 21 - 27 (🔴 Very heavy - isol.ext rains ; 🟠 Heavy - very heavy rains ; 🟡 Mod/heavy rains ; 🟢 Light/Mod showers) #Chennairains #TelanganaRains #HyderabadRains #VizagRains 🌧🌧 https://t.co/752rIj72bQ pic.twitter.com/Reviw3e2wW
— MADRAS WEATHERMAN (R G Prasad) 🇮🇳 (@Chennaiclimate) July 20, 2025