మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కోరిన రంగరాజన్
మొయినాబాద్: దైవానికి రాజ్యాంగ బద్ధమైన అధికారాల కోసం చిలుకూరు బాలాజీ ఆలయం నుంచి జరుగుతున్న ఉద్యమానికి సహకరించాలని అర్చకుడు రంగరాజన్.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కోరారు. ఈ మేరకు బుధవారం నగరంలోని వెంకయ్యనాయుడు నివాసంలో ఆయనను కలిసి విన్నవించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. దేశంలో రామరాజ్య పునఃస్థాపన రాజ్యాంగబద్ధంగా జరగాలని.. సుప్రీం కోర్టుకు తన పరిధి గురించి తెలిపేవిధంగా పిటిషన్స్ కమిటీ రఘురామకృష్ణకు సమర్పించిన లేఖ గురించి వెంకయ్యనాయుడుకు వివరించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని రంగరాజన్ తెలిపారు.