
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలిచేందుకు 30–39 ఏళ్ల మధ్య వయసున్న వారి ఓట్లే కీలకంగా మారనున్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్లు 45,36,852 మంది. వీరిలో 13,87,744 మంది 30–39 ఏళ్ల మధ్య వయసు వారే ఉండటం గమనార్హం. అంటే 30.58 శాతం ఓటర్లు ఈ ఏజ్ గ్రూప్‌లోని వారే . వీరిలో ఎక్కువమంది ఎవరికి ఓట్లు వేస్తే వారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. 30–39 ఏజ్ గ్రూప్‌లో లక్ష మంది కంటే ఎక్కువ ఓటర్లున్న నియోజకవర్గాల్లో నాంపల్లి, కార్వాన్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా నియోజకవర్గాలు ఉన్నాయి.