కదలికలపై పక్కానిఘా | - | Sakshi
Sakshi News home page

కదలికలపై పక్కానిఘా

Published Thu, Nov 9 2023 6:00 AM | Last Updated on Thu, Nov 9 2023 6:00 AM

-

సాక్షి, రంగారెడ్డిజిల్లా: అభ్యర్థుల కదలికలపై ఎన్ని కల సంఘం గట్టి నిఘా పెట్టింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులే కాదు, వారి బంధువులు, ముఖ్య నాయకుల కదలికలపై సైతం దృష్టి సారించింది. ఎన్నికల వ్యయ పరిశీలకులే కాదు పోలీసు, ఎకై ్సజ్‌, ఐటీ, ఇతర కేంద్ర నిఘా సంస్థలు అభ్యర్థుల చుట్టే మోహరించాయి. ఏ రోజు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు.. ఎవరెవరిని కలుస్తున్నారు? అనేదానిపైనే కాకుండా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ఫోకస్‌ పెట్టాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నియోజకవర్గానికి ఒక వ్యయ పరిశీలకుడిని నియమించింది. వీరంతా జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు, ఐటీ, ఎకై ్సజ్‌ విభాగాల అధికారులతో సమావేశమై శాంతిభద్రతల అంశాన్ని చర్చించారు. పోలీస్‌స్టేషన్ల వారీగా ఎంపిక చేసిన తనిఖీ బృందాలు.. ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులు, సీజ్‌ చేసిన నగదు, మద్యం, ఇతర వస్తువులపై వారు ఆరా తీస్తున్నారు. నిఘా సంస్థలు వెంటాడుతుండ టంతో అభ్యర్థులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఇప్పటి వరకు రూ.28.56 కోట్లు సీజ్‌

పోలీసు తనిఖీల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ ఆధారాలు లేని రూ.28.56 కోట్ల నగదు సీజ్‌ చేశారు. 59.22 కిలోల బంగారం, 58.81 కిలోల వెండి, 260 సెల్‌ఫోన్లు సీజ్‌ చేశారు. రూ.47.81 లక్షల విలువ చేసే చీరలు, వంటపా త్రలు, ఇతర వస్తువులను సీజ్‌ చేయడం విశేషం. జిల్లా వ్యాప్తంగా రూ.50 వేలకు మించి నగదు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను వెంట తీసు కెళ్తూ పోలీసులకు 451 మంది పట్టుబడగా, వీరిలో 344 మంది గ్రీవెన్స్‌ కమిటీకి దరఖాస్తు చేసుకున్నా రు. వీరిలో 129 మంది అభ్యర్థనలను, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, వారికి రూ.3.96 కోట్ల విలువ చేసే నగదు, బంగారు ఆభరణాలను తిరిగిచ్చేశారు. రూ.10 లక్షలకుపైగా వెంట తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడిన మరో 28 కేసులను (రూ.7,05,74,517) ఐటీ శాఖకు అప్పగించారు.

అభ్యర్థులు, వారి బంధువులు, ముఖ్య నాయకులే టార్గెట్‌

ఇప్పటి వరకు 451 కేసులు.. రూ.28.56 కోట్ల నగదు స్వాధీనం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement