
మొగిలయ్యను నిమ్స్‌కు తీసుకొచ్చిన దృశ్యం
లక్డీకాపూల్: బలగం సినిమాలోని కై ్లమాక్స్ సాంగ్ ‘తోడుగా మాతో ఉండి’ అనే పాటను ఆలపించి అందరినీ ఏడిపించిన బుడగ జంగాల కళాకారుడు పస్తం మొగిలయ్య తీవ్ర అవస్థతకు గురైన సంగతి తెలిసిందే. మొగిలయ్య ఆరోగ్యంపై రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. దీంతో మంగళవారం రాత్రి మొగిలయ్యను వరంగల్ నుంచి నిమ్స్కు తరలించారు.
కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఏఆర్సీయూ లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.