ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించాలి

Oct 7 2026 2:16 AM | Updated on Oct 7 2026 2:16 AM

ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించాలి

హన్మకొండ : గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు ట్రాన్స్‌జెండర్లకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని వరంగల్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.పూజ సూచించారు. మంగళవారం హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్‌లో ఎఫ్‌ఎంఎం సామాజిక సేవా సంస్థ, మోడరన్‌ అవేర్‌నెస్‌ సొసైటీ, వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ సంయుక్తంగా ట్రాన్స్‌జెండర్లకు మానవ అక్రమ రవాణ నిర్మూలన, హక్కుల పరిరక్షణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో సీనియర్‌ సివిల్‌ జడ్జి పూజ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ట్రాన్స్‌జెండర్లపై సమాజంలో ఇంకా వివక్ష కొనసాగుతోందన్నారు. చదువుకుని అర్హత కలిగిన ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ శాఖలతో పాటు ఇతర సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. హక్కులకు ఎవరైనా భంగం కలిగిస్తే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ ఇన్‌స్పెక్టర్‌, ట్రాన్స్‌జెండర్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఇన్‌చార్జ్‌ కె.రమేశ్‌, హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి కె.విశ్వజ మాట్లాడారు. ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్‌ సిస్టర్‌ సహాయ, కోఆర్డినేటర్‌ ఎర్ర శ్రీకాంత్‌, ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ నాయకులు లైలా, ఎస్సైలు శ్రావణి, సుధాకర్‌, ఏఎస్సై భాగ్యలక్ష్మి, కానిస్టేబుల్‌ రామారావు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement