ఉత్సాహంగా అస్మిత సాఫ్ట్‌ టెన్నిస్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా అస్మిత సాఫ్ట్‌ టెన్నిస్‌ పోటీలు

Sep 16 2026 8:58 AM | Updated on Sep 16 2026 8:58 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియం ఆవరణలోని టెన్నిస్‌ కోర్టులో మంగళవారం నిర్వహించిన హనుమకొండ, వరంగల్‌ జిల్లాలస్థాయి అస్మిత సాఫ్ట్‌టెన్నిస్‌ బాలికల లీగ్‌పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలకు అతిథులుగా డీవైఎస్‌ఓ ప్రశాంత్‌, వరంగల్‌ క్లబ్‌ కార్యదర్శి డాక్టర్‌ ప్రవీణ్‌ హాజరై మాట్లాడారు. సాఫ్ట్‌టెన్నిస్‌ శారీరక దృఢత్వంతో పాటు చురుకుదనం, ఏకాగ్రతను పెంపొందిస్తుందని అన్నారు. బాలికల విభాగంలో అండర్‌–14 17, సీనియర్స్‌ మహిళలకు ఈ పోటీలు నిర్వహించినట్లు ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. సాఫ్ట్‌టెన్నిస్‌ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్‌ ఎరగ్రట్టు స్వామి, సీఐ వెంకటనారాయణ, సిరికొండ సుదర్శన్‌, కోచ్‌లు రమేష్‌, విష్ణువర్ధన్‌, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement