అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం

Sep 16 2026 8:58 AM | Updated on Sep 16 2026 8:58 AM

అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం

న్యూశాయంపేట: దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. మంగళవారం భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని జాతీయ ఇంజనీర్స్‌ డే సందర్భంగా కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలోని విగ్రహానికి కలెక్టర్‌ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజాపాలన దినోత్సవాన్ని

విజయవంతంగా నిర్వహించాలి

ఈ నెల 17న ప్రజాపాలన దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ సత్యశారద సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

సర్వే పారదర్శకంగా నిర్వహించాలి

ఖిలా వరంగల్‌: భూముల రీసర్వే మరింత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. మంగళవారం ఖిలావరంగల్‌ మండలం వసంతాపూర్‌లో భూ రీసర్వేను అదనపు కలెక్టర్‌ కె.కిశోర్‌కుమార్‌, ఆర్డీఓ సుమ, ఏడీ సర్వే అధికారి శ్రీనివాసులతో కలిసి కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం భూముల సరిహద్దులు, సర్వే వివరాలు నమోదు తదితర అంశాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూ వివరాల నమోదులో ఖచ్చితత్వం పాటించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వరంగల్‌, ఖిలా వరంగల్‌ మండలాల తహసీల్దార్లు శ్రీకాంత్‌, ఇక్బాల్‌, సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement