హన్మకొండ: విద్యుత్ పంపిణీలో స్మార్ట్‌గా సురక్షితంగా, మెరుగ్గా కృత్రిమ మేధస్సు (ఏఐ), డ్రోన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా వినియోగిస్తునందుకు, వినియోగదారులకు అందించే మెరుగైన సేవలు, ఆపరేషనల్ ఎక్సలెన్స్‌లో ఉత్తమ పనితీరు కనబరుస్తునందుకు టీజీ ఎన్పీడీసీఎల్ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ నెల 9న బెంగళూర్‌లో టైమ్స్ అస్పైర్ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా పీఎస్యూ – గవర్నెన్స్ ఎక్సలెన్స్ అవార్డును కంపెనీ సెక్రటరీ కె. వెంకటేశం అందుకున్నారు. ఈ నెల 10న న్యూఢిల్లీలో ది ఎకనామిక్స్ టైమ్స్ ఆధ్వర్యంలో అడాప్టింగ్ ఏఐ ఇన్ ఎనర్జీ అవార్డును చీఫ్ ఇంజనీర్ సురేందర్ అందుకున్నారు. ఈ అవార్డులను మంగళవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డికి డైరెక్టర్లు, అధికారులు అందించారు. డైరెక్టర్‌లు వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈ సురేందర్, కంపెనీ సెక్రటరీ వెంకటేశం పాల్గొన్నారు.


