ఖిలా వరంగల్ : వరంగల్ శాకరాసికుంట కట్టపై నార్కొటిక్, మిల్స్‌కాలనీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో గంజాయి విక్రయ ముఠా పట్టుబడింది. వారి నుంచి 250 గ్రాముల ఎండు గంజాయి,139 మత్తు చాక్లెట్లు స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసినట్లు మిల్స్‌కాలనీ ఎస్సై శ్రవణ్‌తెలిపారు. బిహార్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి యువతను లక్ష్యంగా చేసుకుని ఎండు గంజాయి, మత్తు చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు సోమవారం రాత్రి నార్కొటిక్, మిల్స్‌కాలనీ పోలీసులు సంయుక్తగా శాకరాసికుంట కట్టపై తనిఖీలు చేపట్టారు. ఇందులో బిహార్‌కు చెందిన పంచం కుమార్, సుమన్ కుమార్, వీరాజ్‌కుమార్, అఖిలేశ్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్రవణ్ తెలిపారు.
250 గ్రాముల సరుకు, 139 మత్తు చాక్లెట్లు స్వాధీనం


