కాంగ్రెస్‌ సైన్యం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సైన్యం సిద్ధం

May 5 2026 7:08 AM | Updated on May 5 2026 7:08 AM

కాంగ్రెస్‌ సైన్యం సిద్ధం

సామాజిక కోణం.. సీనియార్టీ

డీసీసీ జంబో కార్యవర్గాన్ని ప్రకటించిన అధిష్టానం

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) హనుమకొండ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. మొత్తం 96 మందితో కార్యవర్గాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 12 మందికి జిల్లా ఉపాధ్యక్షులుగా, 25 మంది ప్రధాన కార్యదర్శులు, 44 మంది కార్యదర్శులు, 15 మందికి కార్యవర్గ సభ్యులుగా పార్టీ అవకాశం కల్పించింది. మొట్ట మొదటిసారిగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీలో ట్రాన్‌న్స్‌జెండర్‌ ఓరుగంటి స్నేహకు జిల్లా కార్యదర్శిగా అవకాశం కల్పించారు. ఈ మేరకు ట్రాన్స్‌ జెండర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు ఈవీ శ్రీనివాస్‌, ఓరుగంటి లైలా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం, డీసీసీ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. కాగా, అన్ని వర్గాలకు డీసీసీలో అవకాశం కల్పించారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

డీసీసీ కార్యవర్గం ఇలా..

ఉపాధ్యక్షులు: గురప్రు రాజేంద్రప్రసాద్‌, ఆయాల రాంరెడ్డి, సమ్మెల మహేశ్‌గౌడ్‌, చిటంపల్లి ఐలయ్య, పోలెపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బుడ్డా జగన్‌, అనుకోటి నాగరాజు, బొరిగం స్వామి, ఈర్ల చిన్న, చిన్నాల గోనాథ్‌, పోలెపల్లి బుచ్చిరెడ్డి, మల్లం కుమార్‌ను నియమించారు.

ప్రధాన కార్యదర్శులుగా..

కత్తి సంపత్‌, ఎండీ సద్దాం హుస్సేన్‌, మట్ల రమేష్‌, సారంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బానోత్‌ కల్పన, ఈరుకొండ శ్రీనివాస్‌, పుల్లా శ్రీనివాస్‌, బండా చంటిరెడ్డి, పిడిశెట్టి కనకయ్య, ముప్పు శ్రీనివాస్‌, ఎస్‌కే అమర్‌, సుంచు అశోక్‌, కారాబు రాజేశ్వర్‌రావు, గోల్కొండ సాంబయ్య, బాబా షర్ఫుద్దీన్‌, గుంటి స్వప్న, తోట రాజ్‌కుమార్‌, మారంరెడ్డి కౌతిట్‌ రెడ్డి, బిన్ని లక్ష్మణ్‌, కమలాపురం రమేష్‌, బుర్ర దేవేందర్‌ గౌడ్‌, పిడి కల్పనదేవి, ఆర్పుల రాజు, రావుల భూపాల్‌రెడ్డి, రేవూరి రణధీర్‌రెడ్డిని నియమించారు.

కార్యదర్శులుగా..

కమ్మగోని ప్రభాకర్‌, బత్తిని ఎల్లయ్య గౌడ్‌, మునిగాల యాకూబ్‌, బొజ్జా రవీందర్‌యాదవ్‌, విష్ణుదాస్‌ వంశీధర్‌రెడ్డి, చీరాల విజయ, దూలం సదానందంగౌడ్‌, కేడారి రణధీన్‌, పుల్యాల యాదవరెడ్డి, రాయపురం సాంబయ్య, కట్కూరి స్వామి, మాచర్ల మహేందర్‌, భూక్య రాజు నాయక్‌, కేతపాక శాంతి, ఆదరి రవియాదవ్‌, మోడెం రాకేష్‌, మారపల్లి రవీందర్‌, చల్లా చక్రపాణి, తమ్మిడి మానస, కట్టా రఘుపాల్‌రెడ్డి, చాడా శ్రీనివాస్‌రెడ్డి, ఓరుగంటి స్నేహ, జున్ను హరిసింగ్‌, మనుపటి శ్రీనివాస్‌, తాళ్లపల్లి విజయ్‌, పసునూరి మనోహర్‌, నలుబోల్ల కష్ణ, మార్క రజనీకర్‌, కంచ రవికుమార్‌, చిదురాల శ్రీనివాస్‌రెడ్డి, కట్కూరి స్రవంతి, పుట్టా రాజు, ముక్కెర సురేష్‌, బాచటి మోహన్‌రావు, కక్కెర్ల రాధిక, సదిరాం పోచయ్య, పబ్బా శ్రీనివాస్‌, కొకిరాల స్వాతి, జాఫర్‌ రిజ్వీ, మంద నాగరాజు, బొమ్మాతి చంద్రాపాల్‌, బైరబోయిన రమేష్‌, దువ్వా వీరేశ్‌ కుమార్‌, ఖురేషీ ఇబ్రహీంను నియమించారు.

కార్యవర్గ సభ్యులుగా..

బైరి లింగమూర్తి, రితిక సారమ్మ, ఈ.ఎలీష, కొత్త వాసుదేవరెడ్డి, బచ్చు భాస్కర్‌, నల్లతీగల యాకయ్య, బొజ్జా భాస్కర్‌, తెల్ల సుగుణ, మామిండ్ల సురేష్‌, పొంగులేటి సత్యనారాయణ, గన్ను వెంకటేశ్వర్లు, శ్రీపతి పద్మ, జంగిలి లావణ్య, పసుల విజయ, యాకూబ్‌ పాషాను నియమించారు.

జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యవర్గంలో పలువురు సీనియర్లకు అవకాశం కల్పించారనే చర్చ జరుగుతోంది. సామాజిక కోణం, సీనియార్టీ ప్రాతిపదికన పలువురిని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులుగా నియమించారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

96 మందితో హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ

12 మంది ఉపాధ్యక్షులు, 25 మంది ప్రధాన కార్యదర్శులు

ట్రాన్స్‌జెండర్‌కు కార్యదర్శిగా అవకాశం

Advertisement
 
Advertisement
Advertisement