● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
న్యూశాయంపేట: మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఆదివారం హనుమకొండ ‘కుడా’ కాన్ఫరెన్స్ హాల్‌లో నియోజకవర్గ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. వరంగల్ హనుమకొండ జిల్లా పరిధిలో విస్తారంగా పండిన మొక్కజొన్న పంట, నిల్వ, కొనుగోళ్లు, రవాణా తదితర అంశాలపై సమీక్ష సమావేశంలో చర్చించారు. హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు చాహత్‌బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు రవి, సంధ్యారాణి, ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్.వెంకటయ్య ఆర్డీఓలు, డీసీఓలు తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.


